Saturday, February 26, 2011

Spectrum Raja's House

Think Before You Vote!! 
http://www.thehindu.com/multimedia/dynamic/00111/IN29_RAJA_111566e.jpg

Description: cid:1.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:2.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:2.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:3.2912934713@web94611.mail.in2.yahoo.com


Description: cid:4.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:5.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:6.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:7.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:6.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:8.2912934713@web94611.mail.in2.yahoo.com
Description: cid:9.2912934713@web94611.mail.in2.yahoo.com
Description:
 cid:10.2912934713@web94611.mail.in2.yahoo.com
Forward as a true Indian Citizen....

Sunday, December 26, 2010

కలిసిరాని కాలం

kalam
కలిసిరాని కాలం
కాలం విచిత్రమైంది. ఒక్కోసమయంలో కొందరికి కలిసి వస్తుంది. మరికొందరికి అదే కాలంలో కష్టాలు, నష్టాలు తప్పవు. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారైనా సమస్యల్లో ఇరుక్కుంటారు. వారి ప్రభ మసకబారుతుంది. ఒక్కో ఏడాది ఒక్కోరికి ఒక్కో రకంగా గడుస్తుంది. ఒకప్పుడు రాజకీయాలను శాసించిన వారు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మాట పడాల్సి వస్తుంది. పలుకుబడి తగ్గుతుంది. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా వారి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ ఏడాది అలాంటి వారి జాబితాలో లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవి, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, శశిథరూర్‌, కనిమొళి, ఎ రాజా మొదలైన వారున్నారు.

కేంద్రంలో పదవి పోయింది రాష్ట్రంలో రాను పొమ్మంది
lalu1తన వ్యవహారశైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండే నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. ఆయన పదవిలో ఉన్నా, లేకున్నా ప్రచారంలో మాత్రం ఉంటారు. లోక్‌నాయక్‌ జయ ప్రకాశ్‌ నారాయణ్‌ శిష్యుడైన లాలూ ఒకప్పుడు బీహార్‌ రాజకీయాల్ని శాసించారు. తన 29వ ఏటనే, అంటే 1977లో జనతా పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఘనత ఆయనది. అప్పట్లో జనతాదళ్‌ ఎంపీల్లో లాలూనే పిన్న వయస్కుడు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా, బీహార్‌ ముఖ్య మంత్రిగా చక్రం తిప్పారు. దానికన్నా ఎక్కువగా ఆయనకు దాణా కుంభకోణంతో బాగా ప్రచారం వచ్చింది. జనతాదళ్‌ను వీడి, 1997లో రాష్ట్రీయ జనతాదళ్‌ను (ఆర్‌జెడి)ని స్థాపించిన లాలూప్రసాద్‌ యూపీఏ మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు కీలకపాత్ర పోషించారు. తర్వాత కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టున్నారు. ఈ ఏడాది లాలూకు కష్టకాల మేననాలి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ బాబును, ఆయన పార్టీని బాగా దెబ్బతీశాయి. ఎన్నికల్లో నితీశ్‌కుమార్‌కు గట్టి పోటీ నిచ్చారు. కానీ చివరికి భంగపడక తప్పలేదు. ఇందుకు లాలూ స్వయంకృతాపరాధం కూడా ఉంది. బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చారన్న భావన ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఆ మచ్చను లాలూ తుడిచేసు కోలేకపోయారు. అందుకే లాలూ ఈ ఏడాది వార్తల్లో ఉన్నా, విజయాల్లో మాత్రం లేరు.
పతిదేవుని అడుగుజాడల్లో..
laluఈమె లాలూప్రసాద్‌ యాదవ్‌ సతీమణి. ఆ విధంగానే ఈమెకు గుర్తింపు వచ్చింది తప్ప రాజకీయ నాయకురాలిగా కాదు. దాదాపు నిరక్షరాస్యురాలైన రబ్రీదేవి గతంలో బీహార్‌ ముఖ్యమంత్రి కావడంపై అనేక విమర్శలు వచ్చా యి. ఆమె సాధారణ గృహిణే తప్ప రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి. మూడు సార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా చేసినా రబ్రీదేవికి నాయకురాలిగా పేరు లేదు. పైగా, ఏమీ తెలీని వ్యక్తిని సిఎం సీట్లో కూచోబెట్టడం వల్లనే బీహార్‌ అధోగతి పాలైందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన బీహార్‌ ఎన్నికల్లో రబ్రీదేవి ప్రభావం ఉండవచ్చని భావించారు. ప్రచారంలో ఆమె విస్తృతంగా పాల్గొన్నారు కూడా. అయితే, జనం ఆమెను పట్టించుకోలేదు. ఆర్‌జెడి గెలిస్తే ఆమె మళ్లీ బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ కాలం కరుణించలేదు. రబ్రీని, లాలూను ప్రజలు తిరస్కరించారు.
మిత్రధర్మం మట్టి కరిపించింది
Ram-Paswanలోక్‌జనశక్తి పార్టీ అధినేత పాశ్వాన్‌. లాలూకు, పాశ్వాన్‌కు రాజకీయంగా పోలిక ఉంది. ఆయన మాదిరే ఈయన కూడా 1977లోనే లోక్‌సభకు జన తాపార్టీ తరఫున తొలిసారి ఎన్నికయ్యారు. లాలూ మాదిరే పాశ్వాన్‌ కూడా జనతా పార్టీ నుంచి విడిపోయి, సొంతపార్టీ లోక్‌జనశక్తి స్థాపించారు. ఆయ న లాగే రైల్వే మంత్రిగా పనిచేశారు. రెండు భిన్న ధ్రువాలుగా ఉన్న అధికార కూటముల్లో మంత్రిగా ఉన్న ఘనత పాశ్వాన్‌ది. ఎన్‌డిఏ హయాం్‌ లో పాశ్వాన్‌ హవా నడిచింది. అప్పట్లో రైల్వే మంత్రిగా, తర్వాత బొగ్గుశాఖా మంత్రిగా ఉన్నారు. యూపీఏలో కూడా మంత్రిగా ఉన్న పాశ్వా న్‌ అప్పట్లో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూతో జత కట్టిన పాశ్వాన్‌ ఆయన మాదిరే భంగపాటుకు గురయ్యారు. కొన్నేళ్ల పాటు దళిత కార్డుతో ప్రముఖంగా వెలిగిన పాశ్వాన్‌కు ఈ ఏడాది కలిసిరాలేదు.
పువ్వు పుట్టగానే..
kanimoliఈమె తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎం కరుణానిధి కుమార్తె. రాజ్యసభ సభ్యురాలు. డిఎంకె నాయకురాలు. 2జి కుంభకోణంలో చిక్కుకొన్న కేంద్ర మాజీ మంత్రి ఎ రాజాను మొదటి నుంచీ సమర్థిస్తూనే ఉన్నారు. కుంభకోణంలో ఈమె పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.2జి మేఘాలు ఈమెను కూడా కమ్మాయి. చెనై్నలో కనిమొళికి చెందిన ఒక సంస్థలో కూడా సిబిఐ సోదా జరిపింది.
ఖేల్‌ ఖతం... పైసా హజం !
Suresh-Kalmadiకామన్వెల్త్‌ క్రీడోత్సవాల్లో ప్రాజెక్టుల కేటాయింపులు, వాటి వ్యయం పెంపుపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాటికి కేంద్రబిందువు నిర్వహణా కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన సురేష్‌ కల్మాడీ. క్రీడోత్సవాల ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచడంపట్ల సురేష్‌కల్మాడీ అనేక తీవ్ర ఆరోపణలకు గురయ్యారు. సురేశ్‌ కల్మాడీకి ప్రధాని స్వయంగా అడ్వాన్సులు మంజూరు చేశారని బీజేపీ ఆరోపించింది మీకు, మీ మంత్రివర్గానికీ బాధ్యత లేదా?’ అని గడ్కారీ సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు హఠాత్తుగా పెరగడంపై ఆ పార్టీ కల్మాడీని, ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. క్రీడోత్సవాలకోసం కేటాయించిన 70 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రతిపక్షం నిలదీసింది. కల్మాడీ ఏం చేశారో కాంగ్రెస్‌లో అందరికీ తెలుసు. ఆయన సలహా పైనే ప్రధాని అడ్వాన్సులు విడుదల చేశారని, కల్మాడీకి ప్రధాని విడుదల చేసిన మొదటి అడ్వాన్స్‌పై ఆయన సంతకముందనీ ధ్వజమెత్తింది. కల్మాడీపై వస్తున్న విమర్శలకు తట్టుకోలేక కాంగ్రెస్‌ పార్టీ ఆయనను పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. రెండ్రోజుల కింట సిబిఐ కల్మాడీ నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిపింది. తనే తప్పూ చేయలేదని, అయినా సిబిఐ దర్యాప్తుకు సహకరిస్తానని సురేష్‌ కల్మాడీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఉన్నత వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్నప్పటికీ కల్మాడీకి ఈ ఏడాది కలిసి రాలేదు. ఆరోపణలు, దర్యాప్తులతో గడిచింది.
2జి బకాసురుడా ?
rajaదేశాన్ని, పార్లమెంటును కుదిపేసిన 2జి కుంభ కోణంలో డిఎంకె నాయ కుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. విమర్శల తుపానును ఎదు ర్కొనేందుకు కేంద్ర ప్రభు త్వం ఎంతో అవస్థ పడు తోంది. రాజా ప్రయేయం ఉన్నట్టు అనుకొంటున్న 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంవల్ల పార్లమెంటు శీతాకాల సమవేశాలు స్తంభించిపోయాయి. మాజీ మంత్రి ఎ రాజాకు డిఎంకె పార్టీ అండదండలు మెండుగా ఉన్నాయి. అయినా ప్రతిపక్షాల విమర్శల ధాటికి తట్టుకోలేక రాజీనామా చేయవలసిందిగా కేంద్రప్రభుత్వం ఎ రాజాను ఆదేశించింది. రాజా, ఆయనకు సంబంధించిన వారి నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు జరిపింది. 2జి కుంభకోణంతో రాజా పరువుకు భారీగానే నష్టం వాటిల్లింది.
పుష్కర ప్రేమలో.. శశి గ్రహణం
STHARORకేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌పై విదేశీ ముద్ర ఎక్కువగా ఉంది. ఐక్యరాజ్య సమితిలో సుదీర్ఘకాలం పనిచేసిన శశిథ రూర్‌కు రాజకీయాల్లో అనుభవం తక్కువ. తిరువనంతపురం నుంచి లోక్‌సభ ఎన్నికై విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవి ని నిర్వహించిన థరూర్‌ పదవిని చేపట్టి నప్పటి నుంచీ... తన వ్యాఖ్యలతో అనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 1956లో లండన్‌లో పుట్టిన శశి జీవితం చాలావరకు విదేశాల్లోనే గడిచింది. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కీలక బాధ్యతలు నిర్వహించి, పరిపాలనా వ్యవహారాల్లో సమర్థుడనిపించుకున్నారు. కానీ రాజకీయ రంగంలో రాణించలేకపోయారు. ఆయన మంచి రచయిత, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వక్త, మానవహక్కుల కార్యకర్త. ఎన్నో అవార్డులు అందుకొన్నారు. అయితే, ఈ ఏడాది ఆయన జీవితం ఆరోపణలు, విమర్శలతోనే గడిచింది. ఐపిఎల్‌ క్రికెట్‌ జట్ల ఎంపిక విషయంలో ఆయన కొందరికి సాయం చేశారనే విమర్శలు రావడం, వాటిని ఖండించడం జరిగింది. కానీ, విమర్శల తీవ్రత ఎక్కువ కావడంతో శశిథరూర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

Monday, December 20, 2010

ఎక్కడివీ సిరులు? * ముత్తాతవి ఆకలి కేకలు * ముని మనవడివి తరగని నిధులు * జగన్ మాయలో ఇదే కీలకం *

అది కడప జిల్లాలోని బలపనూరు గ్రామం. ఆ ఊరిలో వైఎస్ వెంకట రెడ్డి అనే పేద రైతు! ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకు పది మంది సంతానం, మరో భార్యకు ఒక కుమారుడు. పదిమంది సంతానంలో ఒక్కరు... వైఎస్ రాజారెడ్డి. ఆయన రాజశేఖరరెడ్డి తండ్రి. అసలే బక్క రైతు! ఆపై గంపెడు సంతానం కావడంతో సహజంగానే వెంకట రెడ్డిని పేదరికం వెంటాడింది.

ఆయనే కాదు ఈ ప్రాంతంలో అనేకమంది రైతులు నిరుపేదలే. బ్రిటిష్ పాలనలో, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఈ ప్రాంతాన్ని దుర్భిక్షం తరచూ పలకరించేది. తెల్లవాళ్ల పాలనలో అందే సహాయమూ ఏమీ ఉండేది కాదు. అదే సమయంలో.. కడప మీదుగా బొంబాయి-మద్రాస్ రైల్వే లైన్ పడింది. ఈ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది. పలురకాల కారణాలతో చాలా మంది పేదలు మతం మారి క్రైస్తవం పుచ్చుకున్నారు.

వారిలో... వెంకట రెడ్డి ఒకరు! అప్పట్లో మతం మారడాన్ని గ్రామస్థులు, బంధువులు తీవ్రంగా పరిగణించి, దాదాపు వెలివేసినంత పని చేసేవారు. ఈ పరిస్థితుల్లో వెంకటరెడ్డి తన కుటుంబంతో సహా సొంత ఊరిని వదిలి పులివెందులకు వలస వెళ్లారు. అక్కడే క్రైస్తవ మిషనరీ శిబిరంలో తలదాచుకున్నారు. మిషనరీ స్కూలులో గంట కొట్టే పనికి కూడా కుదిరారు. కొంత భూమిలో చీనీ (బత్తాయి) పండ్ల సాగు చేపట్టారు.

అయినా ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఆయన అలాగే బండి నెట్టుకొచ్చారు. వెంకటరెడ్డికి ఉన్న 11 మంది పిల్లల్లో రాజారెడ్డిది ప్రత్యేక శైలి. 'ఉన్న చోట ఉండొద్దు. ఇంకా ముందుకు వెళ్లాలి' అనే తత్వం. బహుశా... 'నేను అనుభవించిన కష్టాలు... నా పిల్లలు అనుభవించొద్దు' అని కూడా అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలో రాజారెడ్డి అవకాశాలను వెతుకున్నారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన కాంట్రాక్టులను చేపట్టారు. మెల్లమెల్లగా చుట్టుపక్కల భూములు కొనడం ప్రారంభించారు.

రాజారెడ్డి కొన్నాళ్లలోనే ధనికుడయ్యారు. ప్రైవేటు సైన్యాన్ని నడిపారు. 'రాజారెడ్డి అంటే పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్దమనిషి! ఆయనంటే జనానికి హడల్'. ఇదే సమయంలో ఆయన కన్ను బైరటీస్‌పై పడింది. పెట్రోలియం శుద్ధికి ఉపయోగించే ఈ ఖనిజానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కడప జిల్లాలోని మంగంపేటలో ఉన్న బైరటీస్ గనులకు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి పూర్తిస్థాయి యజమానిగా ఉండేవారు.

రాజారెడ్డి ఏం చేశారో, ఎలా చేశారో తెలియదుగానీ... ఉన్నట్టుండి వెంకటసుబ్బయ్య గనుల వ్యాపారంలో భాగస్వామిగా మారారు. కొన్నేళ్లకు మొత్తం గనులను తనకే విక్రయించాలని వెంకట సుబ్బయ్యను కోరారు. ఆయన ససేమిరా అన్నారు. కొన్నాళ్లకు... వెంకట సుబ్బయ్య హత్యకు గురయ్యారు.

ఆయనను ఎవరు చంపారనే విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే... వెంకట సుబ్బయ్య వారసులు వైఎస్‌పై సచివాలయంలోనే జరిపిన కాల్పుల్లో ఆయన తప్పించుకోగా ఉద్యోగి గాయపడ్డారు. ఏదైతేనేం... అప్పట్లో బైరటీస్ గనులు రాజారెడ్డి సొంతమయ్యాయి.

చదువుకో నాన్నా!

రాజారెడ్డికి చదువు ప్రాధాన్యం బాగా తెలుసు. అందుకే... తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్‌ను చిన్నతనంలో మిషనరీ స్కూలుకు పంపారు. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గా మెడికల్ కాలేజీలో చేర్పించారు. తండ్రి బాగా సంపాదిస్తుండటం, అడగాల్సిన అవసరం లేకుండానే ఇస్తుండటంతో... వైఎస్ వద్ద పుష్కలంగా డబ్బు ఉండేది.

అప్పట్లో ఆయన బాగా ఖరీదైన సిగరెట్లు కాల్చేవారని సహ విద్యార్థులు చెబుతారు. మెడిసిన్ పూర్తయ్యాక వైఎస్ మిషనరీ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరారు. అయితే... రాజారెడ్డి లావాదేవీలు బాగా విస్తరించడం, మంగంపేట బైరటీస్ గనులు కూడా సొంతం కావడంతో వ్యాపారంలో తనకు సహకరించేందుకు ఆయన వైఎస్‌ను ఒప్పించారు.

రాజకీయ ప్రవేశం...

రోజులు గడిచేకొద్దీ... పులివెందులలో రాజారెడ్డి చేసిందే చట్టం అనే పరిస్థితి నెలకొంది. పెద్దసంఖ్యలో అభియోగాలున్నప్పటికీ... ఎమర్జెన్సీ సమయంలోనూ ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సాహసించలేదు. ఒకవైపు కడప జిల్లాలో బాంబులు, హత్యల సంస్క్తృతి అంతకంతకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో... అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అధికారి రాజారెడ్డితో మాట్లాడి, కొన్నాళ్లు జైలులో ఉంటేనే 'సేఫ్'గా ఉంటుందని నచ్చజెప్పారు.

ఇందుకు రాజారెడ్డి సరే అన్నారు. ఏడాదిపాటు జైలు జీవితం గడిపారు. దేశమంతా ఎంతో కొంత అభివృద్ధి చెందు తున్నప్పటికీ... కడప మాత్రం వెనుకబడే ఉంది. బాంబులు, హత్యలు, ముఠాకక్షలతో తల్లడిల్లుతోంది. ఈ క్రమంలో రాజా రెడ్డి చూపు రాజకీయాలపైకి మళ్లింది. తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే రాజకీయ అధికారం కూడా తమ చేతిలో ఉండాలని ఆయన భావించారు.

అంతే... 1978లో వైఎస్ పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్‌లో చీలిక రావడంతో... వైఎస్‌కు సులువుగానే టికెట్ లభించింది. 29 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. వైఎస్‌ను రాజీవ్ బాగా చేరదీశారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చారు. రాజీవ్ మరణం తర్వాత వైఎస్‌కు రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి.

పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంగంపేట బైరటీస్ గనుల లీజులను రద్దు చేసింది. ఇది... వైఎస్ కుటుంబానికి శరాఘాతంలా తగిలింది. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజారెడ్డి హత్యకు గురయ్యారు. కేంద్రంలో పీవీ హయాం ముగియడం, వైఎస్ మళ్లీ పీసీసీ చీఫ్ కావడం కాస్త అటూఇటుగా జరిగిపోయాయి. అత్యధిక కాలం ప్రతిపక్షంలో ఉండటం, ఏళ్ల తరబడి సొంత వర్గాన్ని నిర్వహించాల్సి రావడంతో వైఎస్‌కు క్రమక్రమంగా ఆర్థిక కష్టాలు తలెత్తాయి. చివరికి... ఒక దశలో సొంత ఇంటిని సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

దశ తిరిగింది...

వరుస కరువులు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇంకా అనేక కారణాలవల్ల చంద్రబాబు తొమ్మిదేళ్ల అధికార శకం ముగిసింది. ఆ స్థానంలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో... ఆయన దశ కూడా తిరిగింది. అధికారం కోసం సుమారు పాతికేళ్లకు పైబడి వేచి చూడటం, ఈ దశలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో... ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనే కసి వైఎస్‌లో పెరిగింది.

సహజంగానే ఆయనలో ఉన్న 'నాయకుడు' మేల్కొన్నాడు. ఎవరితో ఎలా డీల్ చేయాలో... అలా చేశారు. వినూత్నమైన విధానాలను అనుసరించారు. 2005, 2007 మధ్య ఉన్న బూమ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. 'పార్టీ ఫండ్' పేరిట నెల నెలా పెద్దమొత్తంలో ఢిల్లీకి మూటలు పంపుతూ అధిష్ఠానాన్ని మచ్చిక చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయనే అధిష్ఠానంగా మారారు.

అప్పటిదాకా... ఎక్కడో బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకున్న వైఎస్ కుమారుడు జగన్ తండ్రి అధికారాన్ని సోపానాలుగా చేసుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2.92 లక్షల ఆదాయపు పన్ను కట్టిన జగన్... ఈఏడాది ఏకంగా రూ.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు.

అంటే... ఆయన వార్షిక ఆదాయం రూ.500 కోట్లు. 2009 మొదటి ఆరు నెలలకు చెల్లించిన పన్నుతో పోల్చితే.. 2010 తొలి ఆరునెలల్లో 1100 రెట్లు అధికంగా జగన్ పన్ను కట్టారు. ఇదీ... ఆయన స్థాయి! సంతానాన్ని పోషించలేక మతం మారిన ముత్తాత వెంకటరెడ్డి ఎక్కడ... కొన్ని తరాలకు సరిపడా ఆస్తులు కూడగట్టుకున్న జగన్ ఎక్కడ!?

వేస్తారా సంకెళ్లు?

'నిరుపేదగా పుట్టడం నీ తప్పు కాదు. కానీ.. నిరుపేదగా మరణించావంటే మాత్రం కచ్చితంగా నీలో లోపం ఉన్నట్లే!' అనేది ఒక సూక్తి! ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డి విజయం సాధించినట్లే. అలాగే.. 'ఎంత సంపాదించావన్నది కాదు! ఎలా అన్నదే ముఖ్యం' అనే నానుడి కూడా ఉంది! ఈ కోణంలో మాత్రం వైఎస్ కుటుంబం సంపాదనా శైలిపై అనుమానం వ్యక్తం చేయాల్సిందే.

ధీరూబాయ్ అంబానీ, లక్ష్మీ మిట్టల్... వంటి వారి వెనుక కొన్నేళ్ల శ్రమ ఉంది. మరి జగన్‌కు ఆరేళ్లు తిరగ్గానే అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు? అన్ని కంపెనీలు ఎలా స్థాపించినట్లు? వైఎస్ సీఎం కాకపోతే జగన్‌కు ఈ సిరి ఉండేదా? మీడియా అనేకసార్లు గుట్టును రట్టు చేసింది. ఇక ప్రశ్నించాల్సింది పౌర సమాజమే! కళ్లు తెరవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! కట్లు తెంచుకోవాల్సింది చట్టం చేతులే!
click here

Sunday, December 19, 2010

భస్మాసుర '' హస్తం '' ?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అసలు ఆ పార్టీలో ఏమి జరుగుతోంది? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ శ్రేణులే సమాధానం చెప్పలేని పరిస్థితి! కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి, రాష్ట్రంలో ఆ పార్టీ ఇంతటి దుస్థితిలో ఎప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పటికీ, భవిష్యత్తుపై ఆ పార్టీ శాసనసభ్యులు, ఎం.పి.లు, నాయకుల్లో అంతులేని నిరాశ అలుముకుంది. పార్టీలో కొనసాగాలా?, లేక కడప మాజీ ఎం.పి. జగన్మోహనరెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో చేరాలా? తేల్చుకోలేక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సతమతమవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ సుస్థిరతపై కూడా పెను అనుమానాలు నెలకొన్నాయి.

శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అంతంత మాత్రమే ఉండటంతో పాటు, పలువురు శాసనసభ్యులు ఇప్పటికే జగన్‌కు జై కొట్టడంతో, ప్రభుత్వ మనుగడపై సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. వరుసగా రెండో దఫా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే ఇంతటి దుస్థితిని ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే కారణమని చెప్పవలసి ఉంటుంది. 2014 నాటికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని కలలు గంటున్న కాంగ్రెస్ వ్యూహకర్తలకు, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడు పడటం లేదు. కేంద్రంలో అధికారం చలాయించడానికి అవసరమైన బలం (ఎం.పి.లు) సమకూర్చిన రాష్ట్రం, క్రమంగా తమ చేజారి పోతున్నదన్న ఆవేదన కాంగ్రెస్ పెద్దలలో కనిపిస్తున్నది.

అయితే ఈ పరిస్థితి ఏర్పడటానికి వ్యూహ రచనా లోపమే కారణమన్న వాస్తవాన్ని అధిష్ఠానం ఇంతవరకూ గుర్తించలేదు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటనతో ఇటు తెలంగాణలో, వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ విషయంలో వ్యవహరించిన తీరుతో అటు సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లే పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాన పోటీ జగన్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి ముందు, జగన్ పార్టీతో సహా అన్ని పార్టీలూ తలవాల్చాల్సిన పరిస్థితి. రాజకీయం ఇలాగే కొనసాగితే తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా కాంగ్రెస్ తోక పార్టీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ముప్పు ముంచుకొస్తున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గానీ, ఢిల్లీ పెద్దలు గానీ, 'జరిగింది ఏమిటి? జరగవలసింది ఏమిటి?' అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రాజకీయ అనుభవం లేకపోయినా, ఒక దివంగత ముఖ్యమంత్రి కుమారుడు తమ అస్తిత్వానికే ప్రమాదకరంగా ఎలా పరిణమించారన్న విషయాన్ని విశ్లేషించి, తదుపరి వ్యూహాన్ని రచించుకోవలసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 'జగన్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. దాన్ని ఓటు బ్యాంకుగా మలచుకోవలసి ఉంది' అని జగన్ వర్గీయుడైన కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ. మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇదివరకే ప్రకటించారు.

జగన్ పట్ల ప్రజలు ఎందుకు ఆకర్షితులవుతున్నారో కాంగ్రెస్ నేతలు ముందుగా విశ్లేషించుకోవలసి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛతో ప్రవేశపెట్టిన పథకాల ప్రభావం ప్రజలపై విపరీతంగా ఉంది. అందువల్లే అప్పట్లో భారీ స్థాయిలో అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నా ప్రజలకు పట్టలేదు. అయితే ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్న అభిప్రాయం ఏర్పడే బదులు, రాజశేఖరరెడ్డి కారణంగానే తమకు లబ్ధి చేకూరిందన్న భావన ప్రజల్లో వ్యాపించింది. అలా జరగడానికి రాజశేఖరరెడ్డి రచించిన వ్యూహాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అర్థం చేసుకోలేకపోయింది.

"రాజశేఖరరెడ్డి మరణిస్తారని గానీ, జగన్ ఇలా తిరుగుబాటు చేస్తారని గానీ మేం కలలో కూడా ఊహించలేదు. అందుకే పార్టీ బదులు రాజశేఖరరెడ్డి జపం చేశాం. ఆయన మరణానంతరం కూడా అదే కొనసాగించాం. ఇప్పుడు అదే మా పాలిట శాపంగా మారుతున్నది'' అని ఒక మంత్రి ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును సమీక్షించాలని రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడే నిర్ణయించారు. కానీ ఆ విషయం ప్రజల్లోకి వెళ్లేలా చేయడంలో ప్రస్తుత మంత్రులు విఫలమవుతున్నారు.

దీంతో రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తమకు మరింత మేలు జరిగి ఉండేదని అమాయక ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితినే జగన్ క్యాష్ చేసుకుంటున్నారు. రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఉన్న సానుభూతిని తనవైపు మళ్లించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరైనా ఇలాగే చేస్తారు! రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే మీకు ఈ గతి (ఏ గతి?) పట్టి ఉండేదా? అని ప్రజలను ప్రశ్నించడం ద్వారా జగన్, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడటానికి బీజం వేయడంతో పాటు, తన తండ్రి స్మృతులు జనంలో సజీవంగా ఉండేలా చూసుకుంటున్నారు.

జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి గానీ, ప్రతి వ్యాఖ్యలు చేయడానికి గానీ మంత్రుల నుంచి శాసన సభ్యుల వరకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరికి వారికి భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడమే! ఇప్పుడు జగన్‌ను వ్యతిరేకిస్తే, భవిష్యత్తులో ఆయనే నిలదొక్కుకుని కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటే, తమ పరిస్థితి ఏమిటన్న సందేహం వారిని పట్టి పీడిస్తున్నది. అలా అని జగన్‌తో చేతులు కలపడానికీ సిద్ధపడలేకపోతున్నారు. ఈ డోలాయమాన స్థితినే జగన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. జగన్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుల వల్ల, జగన్‌కు సీమాంధ్రలో మేలు జరుగుతూ ఉండగా, కాంగ్రెస్‌కు నష్టం కలుగుతోంది.

దీన్ని గుర్తించడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది. జగన్‌ను ఢీకొనే బాధ్యతను సమర్థులైన నాయకులకు అప్పగించవలసిందిపోయి, ప్రజలతో సంబంధాలు లేని నాయకులకు వదలివేయడం కూడా ఆ పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నది. 'రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే మీకు ఈ కష్టం వచ్చి ఉండేదా? మిమ్మల్ని ఆదుకునేవారు కారా?' అని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల పర్యటనలో రైతులను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు. వాస్తవానికి వర్షాలకు పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రకటించిన సహాయం రాజశేఖరరెడ్డి హయాంలో కంటే ఎక్కువే.

అయినా ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేని స్థితిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. వై.ఎస్. హయాంకంటే ఎక్కువ సాయం ఇప్పుడే జరిగిందని ప్రజలు అర్థం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయడానికి మంత్రులు గానీ, శాసన సభ్యులు గానీ ముందుకు రాకపోవడం ఆ పార్టీ నేతల మానసిక స్థితిని తెలియజేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో రాజశేఖరరెడ్డి ముద్రను క్రమంగా తొలగించడంతో పాటు, జగన్ ప్రభావాన్ని తగ్గించడానికి రెండంచెల వ్యూహాన్ని రచించుకోని పక్షంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతానికి మూసుకోక తప్పదు. సంక్షేమ పథకాలను, కష్టమైనా, నష్టమైనా మరింత సమర్థంగా అమలు చేయడం ద్వారా రాజశేఖరరెడ్డిని మరిపింప జేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఉంది.

కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నందున, ఆ ప్రభుత్వ సహాయం తీసుకోవడం ద్వారా, పేద ప్రజలకు మరింత మేలు చేకూర్చే విధంగా కొత్త పథకాలను రూపొందించడం లేదా ఉన్న పథకాలకు మార్పులు, చేర్పులు చేయవలసి ఉంటుంది. తాను ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రతి పథకానికీ రాజీవ్‌గాంధీ లేదా ఇందిరాగాంధీ పేరు పెట్టడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని రాజశేఖరరెడ్డి మభ్యపెట్టారు. అదే సమయంలో తన వల్లే ఆ పథకాలు అమలవుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించేలా మొత్తం పార్టీ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. ఈ కారణంగా రాజశేఖరరెడ్డి ప్రభావం నుంచి ప్రజలను తప్పించనంత వరకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం లో మనుగడ కష్టమే.

అదే సమయంలో జగన్మోహనరెడ్డి నైజాన్ని వివరించడం ద్వారా ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుభూతిని తగ్గించడానికి తగిన వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించుకోవలసి ఉంది. జగన్మోహనరెడ్డి గురించి వ్యక్తిగతంగా తెలిసినవారికి ఆయన నైజం ఏమిటో తెలుసు. ప్రస్తుతం ఆయన వర్గంలో ఉన్న వారు కూడా ఈ వాస్తవాన్ని ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తారు. జగన్ మొండివాడు అనీ, సోనియాగాంధీనే ఎదిరించిన ధైర్యవంతుడు అనీ, రాజశేఖరరెడ్డి కుమారుడిగా ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏం నష్టం జరిగేదనీ ఒక వర్గం ప్రజల్లో అభిప్రాయం ఉంది.

నాణానికి మరోవైపు ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు పారిశ్రామిక వేత్తలు ఇటీవల నన్ను కలిశారు. "జగన్‌కు ప్రజల్లో బాగానే ఆదరణ ఉందని వార్తలు వస్తున్నాయి. కొంపదీసి ఆయన అధికారంలోకి రారు కదా?'' అని ఆందోళనతో ప్రశ్నించారు. "జగన్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? ఎందుకు భయపడుతున్నారు?'' అని ప్రశ్నించగా, "2009 ఎన్నికలకు ముందు ఏదో పని కావాలని జగన్‌ను కలిశాం. మామూలుగా పనులు చేసి పెడితే ఎంతో కొంత ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఆయన మాత్రం తనకు డబ్బు వద్దని, తమ కంపెనీల్లో వాటా కావాలని కోరారు. దీనితో మాకు మతి పోయినంత పని అయింది.

తండ్రి చాటు బిడ్డగానే ఆయన ఇతరుల కంపెనీల్లో వాటాలు ఆశిస్తే, పొరపాటునో- గ్రహపాటునో ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో కంపెనీల పరిస్థితి ఏమిటి?'' అని వారు ప్రశ్నించారు. కేవలం అయిదేళ్ల వ్యవధిలో వేల కోట్ల రూపాయలను జగన్ ఎలా సమకూర్చుకోగలిగారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తికి అధికారం అప్పగిస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, ఆయన ప్రభావం నుంచి పార్టీని రక్షించుకోవలసిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉంది. ఇందుకు అవసరమైన వ్యూహ రచన చేసుకోకుండా, ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో దాడులు చేయించడం వల్ల ఫలితం ఏమి ఉంటుంది? అదనపు పన్ను కట్టమంటే కట్టడానికి జగన్ సిద్ధంగానే ఉన్నారు.

ఎందుకంటే ఆయన వద్ద డబ్బుకు కొదవలేదు కదా! ఈ కారణంగానే, జగన్‌తో చేరితే ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునని పలువురు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. "నేను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ జగన్‌తో కలవను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జనం అంతా ఆయన వైపు ఉన్నా, నేను ఇంట్లో అయినా కూర్చుంటాను గానీ ఆయనతో కలవను.

ఒకసారి జగన్ అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో రెండేళ్లకే ప్రజలకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌నే ప్రజలు ఆశ్రయిస్తారు'' అని ఒక ఎం.పి. చేసిన వ్యాఖ్యలు గమనార్హం. కాంగ్రెస్ బలహీనపడి, జగన్ ఎంతో కొంత బలంగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. అది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పుంజుకోకపోగా, మరో ప్రతిపక్షమైన ప్రజారాజ్యం పార్టీ మరింత బలహీనపడటం.

అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బలపడవలసిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇందుకు కారణాలు ఏమిటో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్వేషించుకోవలసి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ స్నేహ హస్తాన్ని అందుకోవడం ద్వారా తమ భవిష్యత్తు పదిలం అని భావిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, కిందిస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. గత ఎన్నికలలో ఆయనకు అండగా నిలిచిన ఆయన సామాజిక (కాపు) వర్గం, ఇప్పుడు ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా జగన్ వైపు ఆకర్షితమవుతున్నది.

నిజానికి కాపులను కూడగట్టడం ద్వారా, జగన్ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయగలడన్న విశ్వాసంతోనే, కాంగ్రెస్ అధిష్ఠానం చిరంజీవికి స్నేహ హస్తాన్ని చాచింది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కోస్తా జిల్లాలలో ప్రస్తుతం జగన్‌తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించిన నాయకులలో, అత్యధికులు కాపు వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ వాస్తవాన్ని గుర్తించి తగు విరుగుడు చర్యలు తీసుకోని పక్షంలో ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది. తాము బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ కూడా వదిలించుకుంటుందన్న వాస్తవాన్ని గుర్తించి, కనీసం తన సామాజిక వర్గం మద్దతు పొందడానికైనా చిరంజీవి కృషి చేయవలసి ఉంది.

మొత్తం మీద రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి, తక్షణం విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తనకు తానే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది. దివంగత రాజశేఖరరెడ్డి కారణంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. భావితరాల గురించి ఆలోచించేవారు కనిపించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు గడ్డు రోజులే ఎదురవుతాయి. 

-ఆదిత్య

Thursday, December 16, 2010

రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమ వైఎస్ఈజెడ్ - YSEZ


రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమ వైఎస్ఈజెడ్
సెజ్‌లు, మౌలిక సదుపాయాల పేరిట భారీ దోపిడీ

తాను తిని అందరికీ తినిపించడం వైఎస్ స్టయిల్
ప్రభుత్వ భూములు కారు చౌకగా కంపెనీలకు
చుట్టూ ఉన్న అస్మదీయుల భూములకు 'బూమ్'
"సిమెంట్ పరిశ్రమ చూశాం. స్టీల్ పరిశ్రమ చూశాం. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న ఐదున్నరేళ్లలో అవినీతి కూడా ఓ 'పరిశ్రమ'గా వర్ధిల్లింది''... ఇది సర్కారులోని కొందరు ఉన్నతాధికారుల వ్యాఖ్య. సెజ్‌లు, ఐటీ పార్కులు, ఫ్యాబ్ సిటీ... కాదేదీ అవినీతికి అనర్హం అన్న చందంగా ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు చక్రం తిప్పారు.

భారీ ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా వివిధ సంస్థలకు కట్టబెట్టడం, ఆ చుట్టూ భూములున్న పెద్దలు ఆ భూములను కోట్లకు అమ్ముకోవడం... ఇదే వ్యవహారం సాగింది. చంద్రబాబు హయాంలో కుదిరిన ఎమార్, రహేజా ఒప్పందాలు అడ్డగోలుగా ఉన్నాయంటూ ఒకప్పుడు నిప్పులు చెరిగిన వైఎస్ తాను సీఎం అయిన తర్వాత ఇవే సంస్థల ఒప్పందాలను తిరగరాసి మరీ వారికి మరిన్ని 'మేళ్లు' చేసిపెట్టారు.

ఎమార్ ప్రాపర్టీస్, రహేజా ప్రాజెక్టుల ద్వారా ఖజానాకు వాటిల్లిన నష్టమే రూ.1550 కోట్లుగా లెక్కతేలింది. ఆనాడు పత్రికలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోని అధికార కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఎమార్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని స్వయంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, డి.ఎల్.రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏది చేపట్టినా అది భారీగానే ఉండేది. రంగురంగుల కలలను ఐమాక్స్ తెరమీద ఆవిష్కరించడం, అది అర్థమయ్యేలోగానే కోట్లు కొల్లగొట్టడం ఆయన శైలి. వైఎస్ పాలనలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సెజ్‌ల కోసం దాదాపు లక్ష ఎకరాలను పంచిపెట్టారు. వీటిలో జరిగిన అక్రమాలను 'ఆంధ్రజ్యోతి' ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చింది. వీటి భవితవ్యం ప్రశ్నార్థకమేనంటూ ప్రమాద ఘంటికలు మోగించింది. 'ఆంధ్రజ్యోతి' చెప్పినట్టే జరిగింది.

వైఎస్ సర్కారు వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో 75 శాతానికిపైగా భూములు ఇప్పటికీ ఖాళీగానే పడిఉన్నాయి. పరిశ్రమల పేరుతో తీసుకుని ఖాళీగా ఉంచిన భూముల స్వాధీనానికి ఏపీఐఐసీ నోటీసులు జారీ చేస్తున్నా... ఇందులోనూ భారీ ఎత్తున గోల్‌మాల్ జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అవినీతి దందాలో పాత్రంతా అప్పటి ప్రభుత్వ పెద్దలదే. సామాన్య ప్రజలకు పెద్దగా పట్టని రంగాలను ఎంచుకొని పాలకులు అవినీతిని పరిశ్రమగా పెంచిపోషించారు.

ప్రతిష్ఠాత్మక ఫ్యాబ్‌సిటీ ప్రాజెక్టు అమలు కోసం సర్కారు సెమ్ ఇండియాకు చెందిన వినోద్ అగర్వాల్‌తో తొలుత ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. సెమ్ ఇండియాకు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఈ ప్రాజెక్టును అమలు చేసే సత్తాలేదని, వినోద్ అగర్వాల్ గత చరిత్ర అంతా అక్రమాలమయమని 'ఆంధ్రజ్యోతి' ప్రతికే తొలుత వెలుగులోకి తెచ్చింది. కానీ అప్పటీ సీఎం వైఎస్, పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి మాత్రం మా వినోద్ అగర్వాల్ మంచోడు, ప్రాజెక్టును అమలు చేస్తాడు అంటూ బుకాయించారు.

తీరా ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ఇప్పుడు సెమ్ ఇండియా ప్రాజెక్టుకు ఫ్యాబ్‌సిటీలో కేటాయించిన వంద ఎకరాల భూమిని రద్దు చేశారు. కానీ అప్పటికే ఫ్యాబ్‌సిటీ పేరు చెప్పి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దలకు చెందిన అనేక మంది రియల్ ఎస్టేట్ దందా సాగించారు. వీరి వ్యాపారానికి ఎలా ధోకా లేకుండా చేసేందుకు 'ఫ్యాబ్‌సిటీ' ప్రాజెక్టు ఆగిపోకుండా చూడాలని అప్పటి ఏపీఐఐసీ అధికారులకు పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ఐతే ఫ్యాబ్‌సిటీ ఉంది కానీ... ఇందులోని 1200 ఎకరాల్లో సగం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఫ్యాబ్‌సిటీది ఒకఎత్తు అయితే, ఐటీ పార్కుల పేరుతో సాగిన భూ కేటాయింపులు మరో ఎత్తు. వీటిలోనూ ప్రభుత్వ పెద్దలకు వాటాలు చేరాయి. ఇందుకు దర్శకత్వం ప్రభుత్వ సలహాదారుదైతే అమలు వైఎస్‌ది.

ఇందూ, బ్రహ్మణి సంస్థలకు ఐటీ సెజ్‌ల పేరుతో రంగారెడ్డి జిల్లా ల్లో 250 ఎకరాల చొప్పున కేటాయించేసి అందు లో వంద ఎకరాల్లో ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సర్కారు చట్టబద్ధం గా అవకాశం కల్పించింది. రియల్ బూమ్ జోరు మీదున్న సమయంలో ఈ కేటాయింపుల ద్వారా కొందరు భారీ లబ్ధి పొందారు.

రెంటికీ చెడ్డ రేవడి రాష్ట్రం
వైఎస్ హయాంలో పరిశ్రమల పేరు చెప్పి రైతుల భూములు, సర్కారీ భూములు 'ప్రైవేట్' సంస్థలకు పంచిపెట్టారు. తీరా చూస్తే అటు పంటలూ లేవు, ఇటు పరిశ్రమలూ లేవు అన్న చందంగా తయారైంది. విశాఖ, అనంతపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేల ఎకరాల వ్యవసాయ భూములను సెజ్‌లకు కట్టబెట్టారు.

దీంట్లోనూ నేతల వ్యక్తిగత ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జి సిటీ పేరుతో బెంగుళూరుకు సమీపంలో 6వేల ఎకరాలుపైగా ఈ సంస్థకు కట్టబెట్టారు. ఇది గత ప్రభుత్వంలోని పెద్దలకు చెందినవారి సన్నిహితుల కంపెనీ కావటం విశేషం.

15 లక్షలు కాదు... 86 వేలే
పోనీ ఈ భూకేటాయింపుల వల్ల పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమైనా ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయా అంటే.. అదీ లేదు. సెజ్‌ల ద్వారా రాష్ట్రానికి రూ. 1,05,445 కోట్ల పెట్టుబడులు వస్తాయని లెక్కలేసుకోగా ఇంత వరకూ వచ్చినది అందులో 10% (కేవలం రూ.11,942 కోట్లు) మాత్రమే. ఉపాధి కల్పనలోనూ ఇదే తంతు. సెజ్‌ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలో 15,16,131 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు.

ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగావకాశాలు 86,718 మాత్రమే. ఇందులో ప్రత్యక్షంగా లభించిన ఉద్యోగాలు 63,010 అయితే, పరోక్షంగా లభించిన ఉపాధి అవకాశాలు 23,708 మాత్రమే. అంటే సర్కారు చెప్పిన లెక్కల ప్రకారం సెజ్‌ల్లోకి ఇంకా రావాల్సిన పెట్టుబడులు 93,505 కోట్ల రూపాయలు కాగా కల్పించాల్సిన ఉద్యోగాలు 14.29 లక్షలు ఉన్నాయి. రాష్ట్రానికి ఇప్పటివరకూ మొత్తం 113 సెజ్‌లు మంజూరు కాగా ఇందులో 73 సెజ్‌లు నోటిఫై అయ్యాయి.

నోటిఫై అయిన 73 సెజ్‌ల్లో 43 సెజ్‌లు ఇంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ప్రైవేట్ రంగంలోని కాకినాడలోని బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలిలో ఇంత వరకూ ఒక్క సంస్థ కూడా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఈ సెజ్ కోసం ప్రభుత్వ, రైతుల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ (దిల్) నెలకొల్పిన సెజ్‌లు మరీ దారుణం.

ఇంత వరకూ దిల్‌కు చెందిన 14సెజ్‌ల్లో ఒక్కటీ కనీసం నోటిఫికేషన్‌కు కూడా నోచుకోలేదు. కానీ కొంతమంది ఈ సెజ్‌లను ఉపయోగించుకుని తమదైన శైలిలో 'లాభాలు' పొందారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. సెజ్‌ల వల్ల వచ్చిన కృత్రిమ బూమ్‌తో ప్రధానంగా నష్టపోయింది పేద రైతులు, మధ్యతరగతి మానవులే. సెజ్‌ల కోసం పొలాలు, ఆస్తులు కోల్పోయి రైతు రోడ్డున పడితే.. అటు మధ్యతరగతి జనం జానెడు జాగా కొనుక్కోలేని పరిస్థితుల్లో పడ్డారు.

వైఎస్ స్టయిలే వేరు
ఇదివరకటి నేతలు తాము కొంత తిని, తమ చుట్టూ ఉన్న కొద్దిమందికి మాత్రమే భాగాలు పంచేవారు. అయితే అవినీతిలో వైఎస్‌ది సింహం తీరు. ఏనుగు కుంభస్థలం కొట్టడం, పై నుంచి కిందివరకూ, అధిష్ఠానం నుంచి ప్రతిపక్షం వరకూ కొన్ని వందలమందికి అందులో వాటాలు పెట్టడం ఆయన స్టయిల్. తాను తిని, మిగతాది అందరికీ వదిలి, అందరి బాగోగులూ చూసే మృగరాజుగా చలామణి కావడం ఆయన పద్ధతి.

దీనివల్ల రెండు లాభాలు. ఒకటి... కుంభకోణంలో ఎక్కువమందికి ప్రమేయం ఉండడం వల్ల అక్రమం రుజువు కాకుండా అందరూ అడ్డుకుంటారు. రెండు... వైఎస్‌కు వీర విధేయులైన ఓ పెద్ద వర్గం తయారవుతుంది. ఎమార్‌లో అ«ధికార, ప్రతిపక్ష నేతలెందరికో స్థలాలు ఉన్న విషయం ఇటీవల బయటపడింది. ఈ జాబితా ఒక్కసారి చదివితే చాలు... వైఎస్ శైలి ఏమిటో అర్థమవుతుంది.

ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు భార్య, పీసీసీ అధ్యక్షుడు డీఎస్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, దేవేందర్‌గౌడ్ కుమారుడు విజయేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నటుడు మహేశ్‌బాబు, పలువురు అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. ఇపుడు దీనిపై విచారణ పూర్తి స్థాయిలో జరగకుండా పెద్ద శక్తులన్నీ అడ్డుతగులుతున్నాయి. కానీ వైఎస్ ఎత్తులు జిత్తుల్లో నష్టపోయింది మాత్రం రాష్ట్రమే.
click here

అష్టావక్రులు అనే రింగు లీడర్లు
'రాజ'మార్గంలో దారి దోపిడీ

పేదలను కొట్టి పెద్దలకు పంచి..
రూ.35వేల కోట్లు వెనకేసుకున్న అక్రమార్కులు
భూ సేకరణలో భారీ గోల్‌మాల్
అస్మదీయులకు అభయ హస్తం
మాటిమాటికీ మారిన రూటు
ప్రతిసారీ బక్కరైతులే బలి
విపక్షాలపైనా ప్రలోభాల వల
సీబీఐ విచారణకు సహాయ నిరాకరణ
50... 70... 80... 90... 100.... 120.... స్పీడో మీటర్ గిర్రున తిరుగుతుంది. విలాసాల వాహనం సర్రున దూసుకుపోతుంది. వారెవ్వా... ఔటర్ సూపర్! కానీ... ఔటర్ రింగ్ రోడ్డు కింద వేల బతుకులు నలిగిపోయాయని, అక్రమార్కులకు ఇది రాచబాట వేసిందని, కుంభకోణాలకు 'రాజా' వంటిదని కొంచెం లోతుల్లోకి వెళితేనే తెలుస్తుంది. రాజా వారు, ఆయన అనుచర వర్గం కోసం అనేకసార్లు రింగులు తిరిగిన ఔటర్ భూతం పేద రైతులను బలి చేసింది.

అసలు ప్రయోజనాల కంటే పెద్దలకు కాసుల వర్షం కురిపించే ప్రాజెక్టుగా ఇప్పటికే విజయం సాధించింది. తన లేఖలో జలయజ్ఞంలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించిన కొండా సురేఖ ఊహకు కూడా అందనన్ని మలుపులు తిరిగింది. అన్ని వ్యవస్థలను నిర్యీర్యం చేస్తూ అక్రమాల మధ్యనే సాగిన ఔటర్ రోడ్డు నిర్మాణం రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం. అప్పటి సీఎం వైఎస్, ఆయన ఆంతరంగికుడు కేవీపీ కలిసి నడిపించిన మంత్రాంగం! అప్పటి హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ వెంకట్రామ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మాయాజాలం!
 
 ఔటర్‌తో హైదరాబాద్ దశ, దిశ మారుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. ఆ మాటలో నిజమెంతోగానీ... దీనివల్ల చాలామంది దశ, దిశలు మారిపోయాయి. కొందరు కోట్లకు పడగలెత్తారు. మరికొందరు తిరిగి లేవలేనంతగా పడిపోయారు. దీనివల్ల లబ్ధిపొందిన వారిలో మన రాష్ట్ర నేతలే కాదు... ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షానికి చెందిన నాయకులూ 'రింగ్' అయ్యారు. పార్టీలకు అతీతంగా పెద్దలంతా, ఔటర్ పాపాన్ని తలా తట్టెడు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దల భూములకు నష్టం వాటిల్లకుండా... నోరులేని బక్క రైతుల భూముల మీదే రింగు రోడ్డు వేశారు. దీనికోసం కొన్నిచోట్ల మూడుసార్లు మ్యాప్‌లో మార్పు చేర్పులు చేశారు. ఔటర్ గోల్‌మాల్‌కు పాల్పడిన వారిలో 20 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. వీరి విజయానికి ఔటర్‌లో కొట్టేసిన డబ్బులే పెట్టుబడి అయ్యాయి.

భూసేకరణ అస్త్రం

ఔటర్ రింగ్‌రోడ్డు దోపిడీలో కనిపించినంత వైవిధ్యం మరెక్కడా కనిపించదేమో! ఈ దోపిడీలో తొలి అంకం... భూసేకరణ. ఈ చట్టాన్నే బూచిగా చూపి 'ఇస్తావా? చస్తావా?' అంటూ పేదరైతుల మెడపై కత్తి పెట్టారు. వారి భూములు లాక్కున్నారు. అదే సమయంలో... కొందరు పెద్దలు ముందుగానే రంగంలోకి దిగి రైతులపై వల వేశారు. "మీ భూమి ఔటర్‌లో పోతుంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తాం. మాకే విక్రయించండి'' అంటూ ముందే భూములు కొన్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి ఔటర్ మార్గాన్ని మార్పించి, తాము కొన్న భూముల ధరలు అమాంతంగా పెంచుకున్నారు. ఔటర్ ఆలోచన, అది వెళ్లే మార్గం ముందే తెలిసిన ముఖ్య నేతలు, వారి బంధువులు, అనుచరులు ముందే రంగంలోకి దిగి... సమీప ప్రాంతాల్లో భారీగా భూములను కొనేశారు.

ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములను రూ.10 నుంచి 15 కోట్ల చొప్పున విక్రయించుకున్నారు. అలాగే... 'మా భూములు పోకుండా చూడండి' అని ఆశ్రయించిన వాళ్లకు పాలకులు అభయ హస్తం ఇచ్చారు. వారి దగ్గర ముడుపులు పుచ్చుకుని... అలైన్‌మెంట్ మార్చేశారు. జంక్షన్లు, ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల పేరుతో అలైన్‌మెంట్లు మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో బలైపోయింది అమాయకులైన రైతులే.

వేసిందే రోడ్డు..

ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్రియలో అప్పటి అధికారులు గీసిందే మ్యాపు... వేసిందే రోడ్డుగా మారింది. ప్రమాణాల ప్రకారం 250 గజాల వెడల్పు ఉండాల్సిన రహదారి... ఒక్కోచోట సగానికి పడిపోయింది. అటూ ఇటూ ఉన్న వారి ఆస్తులను టచ్ చేయకుండా... రోడ్డే కుచించుకుపోయింది. గండిపేట చెరువు వద్ద పర్యావరణ కారణాలు చూపుతూ అలైన్‌మెంట్ మార్చేశారు.

అదేసమయంలో... కండ్లకోయి వద్ద చెరువులోంచే రోడ్డును వేశారు. ఏం జరిగినా, ఎందుకు మార్చినా కారణం ఒక్కటే! అస్మదీయుల భూములను కాపాడటం! గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పెద్దల భూములను సేకరించినా... వారికి పుష్కలంగా పరిహారం అందించారు. ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేశారు. పేదలపై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

నష్ట పరిహారం ప్యాకేజీ నిర్ణయించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖమంత్రి సబితారెడ్డితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏ ఒక్కరితోనూ చర్చించకుండానే ప్యాకేజీ రూపొందించడం విశేషం.

అందరూ... ష్ గప్‌చుప్!

ముంజేతి కంకణం చూడటానికి అద్దం అవసరంలేదు. అలాగే... ఔటర్ రింగ్ రోడ్డులో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి విచారణలూ అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ చిక్కిపోయిన రోడ్డు, ముమ్మార్లు మారిన ప్లాన్, ఆ సమయంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే... నాటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్భయంగా అక్రమాలకు పాల్పడినట్లు ఇట్టే తెలిసిపోతుంది.

అయినప్పటికీ... దీనిపై విపక్షాలు పెద్దగా ఆందోళనలు చేయలేదు. సర్కారును నిలదీయలేదు. కారణం... నాటి పెద్దలు నయానో భయానో వారందరి నోళ్లను మూయించారు. 'మీ భూములకు భంగం వాటిల్లకుండా చూస్తాం' అని ప్రలోభపెట్టో... 'మీ భూములనూ మింగేస్తాం జాగ్రత్త!' అని భయపెట్టో వాళ్లను దారికి తెచ్చారు.

రకరకాలుగా వారికి ఎర వేశారు. అప్పట్లో సీపీఐ, బీజేపీ మాత్రమే అంతో ఇంతో ఔటర్ అక్రమాలపై గళమెత్తాయి. మిగిలిన పార్టీలన్నీ గప్‌చుప్! 'ఔటర్ అక్రమాలపై ఆందోళన చేద్దాం రండి' అని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని పరిస్థితి!

ఒక ప్రాజెక్టు చేపట్టినప్పడు కొందరు భూములు కోల్పోవడం సహజమే! కానీ... ఒకరి భూములు కాపాడేందుకు మరొకరిని బలి చేయడమే ఔటర్‌లో జరిగిన పాపం. ఈ రహదారి కోసం జరిపిన భూసేకరణలో సుమారు పది వేల కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో నాలుగు వేల మంది రైతులుకాగా... మరో ఆరువేల మంది ప్లాట్లు, ఇళ్లు కోల్పోయారు.

వ్యవస్థలపై దాడి

ఔటర్ రింగు రోడ్డులో అక్రమాలపై 'ఆంధ్రజ్యోతి' అనేక కథనాలు ప్రచురించింది. అయినా... పాలకుల్లో చలనం లేదు. ప్రశ్నించిన వ్యవస్థలపై ఎదురుదాడికి దిగారు. పత్రికల యాజమాన్యాలపై దాడులకు పురిగొల్పారు. ప్రతిపక్షాలను చీల్చారు. పత్రికల్లో కథనాలకు 'కౌంటర్'గా జనం సొమ్ముతో అనుకూలమైన ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లో విపక్షాలు డిమాండ్ చేయడమే ఆలస్యమన్నట్లుగా అనేక అంశాలపై వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధీరోదాత్తుడిగా మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణను తనదైన శైలిలో మడత పెట్టేసేవారు. రింగ్ రోడ్డు విషయంలోనూ అదే జరిగింది. సీబీఐ విచారణను ఆయన నీరుగార్చారు. వాస్తవాలు బయటకు రాకుండా అధికారులను కట్టడి చేశారు.

సర్కారు సహాయ నిరాకరణ చేస్తోందంటూ సీబీఐ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు... అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది ఎంచక్కా మంచి పోస్టుల్లో వెలిగిపోతున్నారు. పేద రైతులు మాత్రం పెద్దలు చేసిన పాపాలకు బలైపోయి కుమిలిపోతున్నారు. వీరికి సమాధానం చెప్పేదెవరు? వీరి ఆవేదనలు తీరేదెన్నడు?

హైకోర్టు తీర్పే నిదర్శనం

ఔటర్ రింగురోడ్డులో భాగంగా కండ్లకోయిలో జరిగిన భూసేకరణపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం భూసేకరణ తీరుపైనే అనుమానాలను వ్యక్తం చేసింది. కండ్లకోయిలో పెద్దల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు.

ఇతరుల భూములు, పక్కనే చెరువు మీదుగా రోడ్డు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకెక్కారు. 55 ఎకరాల్లో అక్రమంగా భూసేకరణ జరిగినట్లు కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కచోట జరిగిన భూసేకరణలోనే ఇంత గోల్‌మాల్! మరి... 162 కిలోమీటర్ల పొడవునా ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉండాలి?

* ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డుపెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేలకోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టుకుంది.
* ఇందులో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధిపొందారు.
* నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు.
* హయత్‌నగర్ మండలం బాచారంలో సుమారు 25 లక్షల రూపాయలను అక్రమంగా చెల్లించారు.

అంతా ఇష్టానుసారం...

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రింగురోడ్డును ఇష్టానుసారంగా నిర్మిస్తోంది. పెద్దల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా... ఒక్కో చోట ఒక్కో విధంగా వెడల్పు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నార్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 125 మీటర్లు, శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 150 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు.
click here

జలగల యజ్ఞం
రాష్ట్రానికి అవినీతి కాటు.. ఖజానాకు రక్త పోటు

పైరు పచ్చని కలల సాక్షిగా అడ్డగోలు దోపిడీ
వైఎస్, కేవీపీ కలిసి సాగించిన ధన యజ్ఞం
పప్పుబెల్లాఆ్ల పనులు పంచేశారు
ప్రాజెక్టుల పూర్తికంటే.. వాటాలపైనే ధ్యా
ఆరోపణలు చేసిన వారిపౌ ఎదురుచూపులు
నిజమవుతున్న నాటి హెచ్చరికలు
స్మారకాలుగా మారుతున్న ప్రాజెక్టులు
హైదరాబాద్, డిసెంబర్ 13 : 'జల యజ్ఞాన్ని వ్యతిరేకించిన వారు రాక్షసులవుతారు'... ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పెట్టిన శాపం! బహుశా... ఈ శాపానికి భయపడే కాబోలు! అప్పట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ మౌనంగా ఉన్నారు. అప్పటి భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి, వైఎస్ ఆత్మబంధువైన కేవీపీ కోట్లు దండుకుంటున్నారని తెలిసినా ఏమీ మాట్లాడలేకపోయారు! వైఎస్ మరణించడంతో, ఆయన శాపానికి కూడా కాలం చెల్లిందనే ధైర్యంతోనే సురేఖ ఇప్పుడు నోరు తెరిచినట్లున్నారు.

'నీకు తెలియకుండా కేవీపీ, పొన్నాల కోట్లు దండుకుంటున్నారన్నా!' అని వైఎస్‌కు ఒక్కముక్కయినా చెప్పారో లేదోకానీ... ఇప్పుడు ఏకంగా బహిరంగ లేఖ సంధించారు. తాను కేవీపీని మాత్రమే టార్గెట్ చేశానని సురేఖ అనుకుంటున్నారు. కానీ... వైఎస్ ప్రవచిత 'ఆత్మ సిద్ధాంతం' ప్రకారం, కేవీపీ అవినీతికి పాల్పడితే అది ఒక్కరికే పరిమితం కాదని, వైఎస్‌తో ముడిపడి ఉంటుందని ఆమె మరిచారు!

ఆలోచన, ఆచరణలో కలగలసి, కలివిడిగా సాగిన వైఎస్, కేవీపీలు ఉమ్మడిగా వెలిగించిందే... 'జలయజ్ఞం'. దీని వెనుక ఒక భారీ నేపథ్యం ఉంది. చంద్రబాబు హయాంలో వరుస కరువులు రాష్ట్రాన్ని పీడించాయి. పొలాలన్నీ దాహంతో నోళ్లు తెరిచాయి. నీటి కోసం కట కట! చుక్క చుక్కనూ ఒడిసి పట్టుకోవాల్సిన అగత్యాన్ని, ప్రాజెక్టుల అవసరాన్ని 'ఆంధ్రజ్యోతి' గుర్తించింది. 2003లో 'జల జాగృతి' పేరిట ప్రత్యేక ప్రచారోద్యమాన్ని చేపట్టింది.

ఏ ప్రాంతంలో ఏయే అవసరాలున్నాయో, దానికి పరిష్కారం ఏమిటో సూచిస్తూ కథనాలు ప్రచురించింది. సరిగ్గా దీనినే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ తన ప్రధాన ఎన్నికల అంశంగా మార్చుకున్నారు. పాదయాత్రలో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు... నీటి కరువు ఎదుర్కొంటున్న రైతులకు వైఎస్ ఓ జల ప్రదాతగా కనిపించారు.

అన్నట్లుగానే... ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జలయజ్ఞం చేపట్టారు. గుక్కెడు నీటి కోసం ప్రజలెట్లా అల్లాడిపోతున్నారో పాదయాత్ర సమయంలో కళ్లారా చూశానని... వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకే జలయజ్ఞం చేపట్టానని ప్రకటించారు. జలయజ్ఞం వెనుక భారీ దోపిడీ పథకం ఉందని కొద్ది రోజులకే తేటతెల్లమైంది.

అవినీతితో శ్రీకారం జలయజ్ఞాన్ని కాసులు కురిపించే కల్పవృక్షంగా మార్చుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉంది. ఎంపిక చేసిన కొందరు కాంట్రాక్టర్లతో కలిసి వైఎస్, కేవీపీలు దోపిడీ ప్రణాళిక రచించారు. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లు మాత్రమే రంగంలో ఉండేలా నిబంధనలు రూపొందించారు. దేశీయ, విదేశీ సంస్థలతో జట్టు కట్టించి, జాయింట్ వెంచర్లు సృష్టించారు. ప్రపంచంలో ఎక్కడా అమల్లో లేని ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) అనే కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఆవిర్భవించినవే 'నవ గ్రహాలు'! ఇవన్నీ... అధికార కేంద్రమైన వైఎస్ చుట్టూ తిరుగుతూ, కేవీపీ చెప్పినట్లుగా వినే కాంట్రాక్టు సంస్థలు! కాంట్రాక్టుల ఎంపికలోనే కాదు... చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరించారు. భారీగా నిధులు అవసరమయ్యే సాగునీటి ప్రాజెక్టులనే ఎంచుకున్నారు. 'ఎంత ఖర్చు పెడితే.. అంత లాభం' అనే సూత్రాన్ని అనుసరించారు.నవ గ్రహాల ఎంపికలో, ప్రాజెక్టుల గుర్తింపులో నాటి పాలక పెద్దల 'లక్ష్యం' ఒక్కటే!

అది... దోపిడీ! అప్పట్లో... మొత్తంగా 26 ప్రాజెక్టులను ఎంపిక చేసి, వాటి పనులను ప్యాకేజీలుగా విభజించారు. నవగ్రహాల్లో ఎవరెవరికి, ఏ పనులు ఇవ్వాలో నిర్ణయించారు. పప్పు బెల్లాలకంటే దారుణంగా టెండర్లను పంచిపెట్టారు. ఇది సరిగ్గా ఆరేళ్ల కిందటి మాట.

అప్పుడు కుదిరిన టెండర్ ఒప్పందాల ప్రకారం... ఆ పనులన్నీ ఇప్పటికి పూర్తయి, ఎనిమిది లక్షల ఎకరాల్లో జలాలు పరుగులెత్తి, వందల కోట్ల రూపాయల సొమ్ము రైతుల లోగిళ్లలో చేరి ఉండాలి. కానీ... ఇదంతా ఒక అందమైన భ్రమ. రైతుల ముంగిట కురవాల్సిన జలయజ్ఞం ధనరాశులు.. అధికార పార్టీ నేతల సీక్రెట్ అకౌంట్లలో, బంకర్లలో పేరుకుపోయాయి. నాగపూర్ చుట్టుపక్కల వందల ఎకరాల భూముల కొనుగోలుకు పెట్టుబడులుగా మారాయి.

దోపిడీకి 'రాజ'మార్గం దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు... ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ఎప్పుడూ దృష్టి సారించలేదు. మరింత సమర్థంగా దోపిడీ చేయడంపైనే కన్నేశారు. బిల్లులు మంజూరు చేసిన ప్రతిసారీ వాటాలు మినహాయించుకోవడం ఒక పద్ధతి! నాటి ప్రభుత్వ పెద్దలకు ఇదంతా చిల్లర వ్యవహారంలాగా కనిపించింది.

అందుకే, మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే మహత్తరమైన విధానాన్ని అనుసరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన ఈ ప్రక్రియను వైఎస్, కేవీపీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద అంచనా వ్యయంలో పది శాతాన్ని కాంట్రాక్టర్లకు ముందుగానే చెల్లించారు. అంటే... తట్టెడు మట్టి ఎత్తకున్నా, బుట్టెడు కాంక్రీటు కలపకున్నా కాంట్రాక్టర్ల చేతిలో కోట్లు గుమ్మరించారు.

ఇందులో నుంచే తమకు దక్కాల్సిన ముడుపుల వాటాలో సగాన్ని మినహాయించుకున్నారు. మిగిలిన సగం... బిల్లుల విడుదల సమయంలో చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జలయజ్ఞంలో నాటి పాలకుల వాటా ఆరు శాతం! ఈ వాటాలో 3 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుల నుంచే మినహాయించుకున్నారు. 2007-08 వరకు మాత్రమే జలయజ్ఞానికి నిధుల వరద పారింది. ఆ తర్వాత కటకట మొదలైంది.

బిల్లుల చెల్లింపుతోపాటు... వాటాల బకాయి వసూలు కూడా పెండింగ్‌లో పడింది. దీంతో ఒక దశలో కేవీపీ స్వయంగా కల్పించుకుని... కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత... బిల్లుల చెల్లింపులో ప్రాధాన్య పద్ధతిని తెరపైకి తెచ్చారు. ప్రాజెక్టుల అవసరాలను బట్టి ప్రాధాన్యం నిర్ణయించారనుకుంటే పప్పులో కాలేసినట్లే! తమకు అందాల్సిన వాటాలను బట్టి ప్రాధాన్యం నిర్ణయించి... వారికే బిల్లులు చెల్లించడం మొదలుపెట్టారు.

కొన్నాళ్లకు ఇది కూడా చిల్లర వ్యవహారంగానే అనిపించింది. వాటాల్లోనూ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. విడతలు విడతలుగా 3 శాతం ఇచ్చే బదులు... ఒకేసారి 1.5 శాతం ఇస్తే చాలంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇదీ... ముడుపుల వసూళ్లపై వారికి ఉన్న శ్రద్ధ! మరి ఇదే శ్రద్ధ ప్రాజెక్టు పనులపైనా ఉందనుకుంటే పొరపడినట్లే!

గ్రహాలు... ఉపగ్రహాలు! జలయజ్ఞం పనులు పొందిన కాంట్రాక్టు సంస్థలు అగ్రిమెంట్లు, బిల్లుల వసూళ్లకే పరిమితమయ్యాయి! క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాజెక్టులోనూ సబ్ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశారు. ఇంకా చెప్పాలంటే... అసలు కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అమ్ముకున్నారు. ఇది ఒక్కరితో ఆగిపోలేదు. ఆ సబ్ కాంట్రాక్టర్లు 'సబ్ సబ్ కాంట్రాక్టర్ల'కు పనులు అప్పగించారు. దీనికి ఉదాహరణ గండికోట డ్యామ్ నిర్మాణం.

ఈ ప్రాజెక్టును అసలు కాంట్రాక్టు సంస్థ వైఎస్ బావమరిది రవీంద్రనాథ రెడ్డికి సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన ఇదే పనులను మరొకరికి బదిలీ చేశారు. రవీంద్రనాథ రెడ్డి ఒక్కరే కాదు... వైఎస్ హయాంలో చాలామంది కాంట్రాక్టర్లుగా కొత్త అవతారాలు ఎత్తారు. అప్పటిదాకా... కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు విడివిడిగా ఉండేవారు. వైఎస్ హయాంలో... నాయకులే బినామీల పేర్లతో పనులు చేపట్టడం మొదలుపెట్టారు.

మొత్తానికి... సబ్ కాంట్రాక్టర్ల చేతికి చిక్కిన జలయజ్ఞం... ఫలాలు అందించకుండానే చతికిలపడింది. ఏడాదిన్నరలో పూర్తయ్యేలా 2004లో ఒప్పందాలు కుదుర్చుకున్న 26 ప్రాజెక్టులు ఆరేళ్లయినా కొలిక్కి రాలేదు! ఇంత కీలకమైన సమస్యను జల ప్రదాత వైఎస్‌గానీ, ఆయన ఆంతరంగికుడు కేవీపీగానీ ఎప్పుడూ సీరియస్‌గా పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదని అప్పుడే తేలిపోయింది.

ఇంతింతై వటుడింతై.. 2004 ఆగస్టులో 26 ప్రాజెక్టులతో జలయజ్ఞం మొదలైంది. తర్వాత 'మాకూ ఓ ప్రాజెక్టు కావాలి' అనే డిమాండ్లు తలెత్తాయి. అడిగిన వారికి అడిగినట్లు, అడగడమే ఆలస్యమన్నట్లుగా వైఎస్ 'ప్రాజెక్టుల వరాలు' ఇస్తూ వెళ్లారు. భూసేకరణ, నీటి కేటాయింపులు, సాధ్యాసాధ్యాలు, పునరావాసం... ఇలాంటివేవీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రాజెక్టులు చేపట్టారు. ఆ క్రమంలోనే ప్రాజెక్టుల సంఖ్య 26 నుంచి 86కు పెరిగింది. ఇదంతా వాటాల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అంచనాలకు రెక్కలు... జలయజ్ఞంలో ప్రాజెక్టుల సంఖ్య ఎలా పెరిగిందో... వాటి అంచనా వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. ఎక్కువ శాతం కాంట్రాక్టర్లకు అనుగుణంగా అంచనాలకు రెక్కలు తొడిగారు. మరింత మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేందుకు, సొంత వాటాలు ఇంకొంచెం పెంచుకునేందుకు అంచనాలు అంతకంత చేశారు.

అంచనా వ్యయం రెట్టింపునకు మించి పెరిగిన ప్రాజెక్టులూ ఉన్నాయి. కోయిల్ సాగర్ ప్రాజెక్టును రూ.109 కోట్లతో చేపట్టగా... ఇప్పుడు దాని అంచనా వ్యయం రూ.359 కోట్లకు చేరింది. ప్రాణహిత-చేవెళ్ల తొలి అంచనా వ్యయం 17,875 కోట్లు. ఇప్పుడు... 49,300 కోట్లు. ఒకటీ రెండూ కాదు... ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి!

చివరికి మిగిలేది? జలయజ్ఞంలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థలతో 1,20,000 కోట్ల రూపాయల విలువైన అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. ఇప్పటికే సుమారు 50వేల కోట్లు ఖర్చయ్యాయి. ఇంకా ఖర్చు పెట్టాల్సిన మొత్తం 70 వేల కోట్లు! ప్రస్తుతం నెలకు సగటున రూ.500 కోట్లు మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణంపై వెచ్చిస్తున్నారు. అంటే... ఏడాదికి 6 వేల కోట్లు. ఈ లెక్క ప్రకారం... మొత్తం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది!

ఈ పరిస్థితిని నిపుణులు ఎప్పుడో ఊహించారు. ఇలా విచ్చలవిడిగా ప్రాజెక్టులు చేపడితే, ఏవీ పూర్తి కావని సర్కారును హెచ్చరించారు. ప్రాధాన్య క్రమంలో, ప్రాంతానికి ఒక్కటి చొప్పున చేపట్టి వాటిపైనే దృష్టి సారించి, నిధులు విడుదల చేస్తేనే జలయజ్ఞ ఫలాలు అందుతాయని తేల్చి చెప్పారు. లేని పక్షంలో... ప్రాజెక్టులన్నీ స్మారక చిహ్నాలుగా మిగులుతాయని స్పష్టం చేశారు.

కానీ... అంకెల గొప్పల మాటున వాటాలు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న నాటి పాలకులు ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు నిపుణులు చెప్పిందే నిజమవుతోంది. జలయజ్ఞం కుంటి నడక నడుస్తోంది. సగం పూర్తయి మిగిలిన ప్రాజెక్టులు వైఎస్ స్మారకాలుగా మిగిలే పరిస్థితి నెలకొంది.

మరి... ఖర్చైపోయిన నిధులు ఏమైపోయినట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు? ఈ 'నిరర్థక' ప్రాజెక్టులను చేపట్టిన వారిని శిక్షించాల్సిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వమే చెప్పాలి! ఒక్కటి మాత్రం నిజం! పాపం ఒకరిది! దాని భారం అనుభవిస్తున్నది మాత్రం ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు.

జలయజ్ఞంలో అక్రమాలపై నిలదీసిన ప్రతిసారీ వైఎస్ ఎదురుదాడికి దిగారు. సాంకేతికపరమైన ఆరోపణలకు సాంకేతికంగానే సమాధానాలు ఇవ్వాల్సింది పోయి... దీనినో రాజకీయ చర్చగా, రచ్చగా మార్చారు. ప్రాజెక్టుల వద్దే చర్చల ప్రహసనం ఏర్పాటు చేసి... 'అధికార బలం'తో పైచేయి సాధించారు.

'జలయజ్ఞంలో ఎలాంటి అవినీతీ లేదని తేలిపోయింది' అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. వైఎస్ హయాంలో ఒక్క పీజేఆర్ మినహా... జలయజ్ఞంలో అక్రమాలపై నోరెత్తిన కాంగ్రెస్ నేతలెవరూ లేరు. పైగా... అక్రమాలను వెనకేసుకొస్తూ వైఎస్ ప్రశంసల కోసం పోటీలు పడేవారు. ఇందుకు ప్రతిఫలంగా కొన్ని ప్యాకేజీలనో, ఒకట్రెండు ప్రాజెక్టులనో, ఇంజనీరింగ్ కాలేజీనో, ప్రభుత్వ భూమినో నజరానాగా పొందడం అప్పట్లో పరిపాటిగా మారింది.

* ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టులు పూర్తి కాకుండానే, కాల్వలు తవ్వారు. మట్టి పనిలో అధిక లాభాలు రావడమే దీనికి కారణం. పోలవరం ప్రాజెక్టు దీనికి ఒక ఉదాహరణ.
* ఎత్తిపోతల పథకాల కింద చెరువుల్లో నీరు నింపి, అప్పటికే చెరువుల కింద ఉన్న ఆయకట్టును కొత్తగా సృష్టించినట్లుగా చెప్పుకొన్నారు. వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టు దీనికి నిదర్శనం.
* ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించని ప్రాజెక్టు కింద వేల ఎకరాలు సృష్టించినట్లు అధికారికంగా అబద్ధాలు ఆడారు.

* చంద్రబాబు హయాంలో వరుస కరువులు

* జల ప్రదాత అవతారమెత్తిన వైఎస్
* అధికారంలోకి రాగానే జలయజ్ఞం ప్రకటన
* ఈపీసీ విధానంతో దోపిడీకి శ్రీకారం
* 'నవ గ్రహ' అనుకూల కాంట్రాక్టర్ల ఎంపిక
* వనరులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులు
* మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో సొమ్ము పందేరం
* అడ్వాన్సుల్లో సగం ముడుపు కింద మినహాయింపు
* బిల్లుల సమయంలో మిగిలిన వాటా వసూలు
* 'బకాయిల' వసూలుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్
* అసలు కాంట్రాక్టర్ల స్థానంలో సబ్ కాంట్రాక్టర్లు
* విచ్చలవిడిగా పెరిగిన ప్రాజెక్టులు, అంచనాలు
* చతికిల బడిన జలయజ్ఞం

click here

గనులను మింగిన ఘనులు
వేల కోట్ల ఖనిజాలు 'గాలి'కి .. వైఎస్‌దే ప్రత్యక్ష పాత్ర

నేటికీ జగన్‌తో జనార్దర్‌రెడ్డి చెట్టపట్టాలు
సకాలంలో స్పందించని యంత్రాంగం
అధినేత మారాకే నోరు విప్పుతున్న నేతలు
'అవినీతి బాధాకరమైన వాస్తవం'... ఇది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఉవాచ! అవినీతి జరుగుతోందని, అది వాస్తవమని ఆమెకు ఇప్పుడే గుర్తుకొచ్చిందనుకుంటే పొరపాటే... ఈ విషయాన్ని ఇన్నాళ్లుగా ఆమె 'కావాలనే' మరిచిపోయారు. లేదా... విపక్షాల అవినీతినే గుర్తు చేసుకుంటారు. వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఆమెకు తెలియదనుకోవడం అమాయకత్వమే. కాకపోతే... ఈ స్థాయిలో అవినీతి జరిగినట్లు సోనియాకు కూడా తెలియకపోయి ఉండొచ్చు.

ఇప్పుడు... కేవీపీకి మాత్రమే అవినీతిని అంటగట్టి జగన్ వర్గం కూడా అమాయకత్వం ప్రదర్శించింది. "జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిన మాట నిజమే. కానీ దానికి బాధ్యుడు కేవీపీనే''... అని జగన్ వర్గం పేర్కొంది. అయితే వైఎస్, ఆయన అనుయాయుల దోపిడీ ఒక్క జలయజ్ఞానికే పరిమితమా? కానేకాదు. అది బహుముఖం.

ఈ ఘనుల దోపిడీ మార్గాల్లో గనులది ఓ ప్రత్యేక స్థానం. గనులన్నింటినీ గుప్పిటపట్టి, అస్మదీయులకు కట్టబెట్టి, ఆలయాలనూ కూలగొట్టి, ఖనిజాలను కొల్లగొట్టి, ఆ సొమ్ముతో సొంత పరిశ్రమలు పెట్టి, వాటికి వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి, రాష్ట్ర వనరులను యావత్తూ తమ 'ఉక్కు' సంకెళ్లలో బిగించిన ఘనత నాటి వైఎస్ జమానాదే!

ఈ అవినీతి సొమ్ముతో రెండు రాష్ట్రాల్లో, రెండు పార్టీల్లో చక్రం తిప్పిన చాణక్య నీతి వారిదే!! వైఎస్ సీఎంగా ఉన్న ఆరున్నర సంవత్సరాల కాలంలో అన్నింటా కీలక పాత్ర ఆయన సలహాదారు కేవీపీది అయితే.... గనుల వ్యవహారంలో మాత్రం వైఎస్‌దే ప్రత్యక్ష పాత్ర అని అప్పట్లో ప్రభుత్వ వ్యవహారాల గురించి తెలిసినవారంతా చెప్పే మాట.

అయితే, వైఎస్ చెప్పినట్లు అప్పటి అధికారులు 'జాగ్రత్తలు' తీసుకునేలా పర్యవేక్షించడం మాత్రం కేవీపీ బాధ్యతని ఆ శాఖ వర్గాలు చెబుతాయి. చేతిలో ప్రభుత్వం. చెప్పింది చెప్పినట్లు చేసిపెట్టే అధికార గణం. ఇంకేం కావాలి... ప్రజలందరికీ చెందాల్సిన ఖనిజ సంపదను, వేల ఎకరాల భూములను కావాల్సిన వారికి దోచిపెట్టడానికి? వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే సాగింది.

ప్రజలకు చిన్న తాయిలాలు పారేస్తే చాలు... రాష్ట్ర వనరులను ఎంతగా దోచుకున్నా ఎవరూ పట్టించుకోరనే వ్యూహంలో భాగంగానే వైఎస్ గనులపై కన్నేశారు. అనంతపురం జిల్లాలోని ఇనుప ఖనిజం నిక్షేపాలు, చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, ఉత్తరాంధ్రలో బాక్సైట్ నిక్షేపాలు... ఇలా దేనినీ వదిలిపెట్టలేదు.

గుట్టు విప్పింది ఆంధ్రజ్యోతే

అనంతపురం జిల్లాలోని వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజం నిక్షేపాలను వైఎస్‌కు సన్నిహితుడైన గాలి జనార్దన రెడ్డికి అప్పనంగా అప్పగించేస్తున్నారన్న విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' పత్రికే మొట్టమొదటిసారి వెలుగులోకి తెచ్చింది. 'గనుల శాఖలో గోల్‌మాల్' పేరుతో 2007 జూన్ 24న కథనాన్ని ప్రచురించింది.

అనంతపురం జిల్లాలోని ఇనుప ఖనిజం గనుల కోసం జి.సురేష్ బాబు, సునీల్ ఎర్ల అనే వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా... వీరిని సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి పక్కకు తప్పించి.. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ)కి 103 హెక్టార్ల గనులు కేటాయించేశారు. ఓఎంసీ అధినేత గాలి జనార్దన్‌రెడ్డి వైఎస్‌తోపాటు ఆయన తనయుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడు.

జగన్ సొంత పార్టీ పెట్టుకున్నాక ఎన్‌డీఏలోకి రావాలని ఆయన ఆహ్వానిస్తున్న సంగతి గమనార్హం. ఓఎంసీకి గనుల కేటాయింపులో, గనుల తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినా... ఆనాడు వైఎస్ నీడలో ఉన్నవారెవరికీ అది తప్పుగా కనిపించలేదు.

సరిహద్దుల్ని అతిక్రమించి యథేచ్ఛగా ఖనిజం తవ్వుతున్నారని, ఇందుకోసం ఓ దేవాలయాన్ని కూడా కూల్చేశారని... ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చినా అటు కాంగ్రెస్ అధిష్ఠానంగానీ, ఆ పార్టీ నాయకులుగానీ స్పందించలేదు. చివరికి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగమూ అదేమీ పట్టనట్లు వ్యవహరించింది. ఓబుళాపురం సంగతి తేల్చేస్తామంటూ వెళ్లిన అఖిలపక్షంలోని కొందరు నేతలు సైతం గాలి జనార్దనరెడ్డి మాయలో పడిపోయారు.

శ్రమ లేకుండా పరిశ్రమ

ఓఎంసీకి గనుల కేటాయింపు ఒక ఎత్తయితే... ఆ సంస్థ అధినేత గాలి జనార్దన్‌రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ పేరిట ఏర్పాటు చేయతలపెట్టిన ఉక్కు పరిశ్రమకు భూమి కేటాయింపు మరో ఎత్తు. ఏ పారిశ్రామికవేత్త అయినా పరిశ్రమ పెట్టడానికి కొంతైనా సొంత నిధులు సమకూర్చుకోవాలి. అలాంటిదేమీ లేకుండా 'ప్రభుత్వమే నా పెట్టుబడి' అన్న చందంగా గాలి జనార్దనరెడ్డి సాగించిన దందా చూస్తే ఎవరికైౖనా కళ్లు తిరగక మానవు.

వెనకబడిన కడప జిల్లాల్లో భారీ స్టీల్ ప్లాంట్ పెడుతున్నందునే గాలికి అనంతపురంలో ఇనుప ఖనిజం నిక్షేపాలు కేటాయించినట్లు సర్కారు అప్పట్లో సమర్థించుకుంది. పైగా బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ కోసమంటూ ప్రభుత్వం కడప జిల్లా అంబవరం వద్ద ఎకరా రూ.18,500 లెక్కన 10675 ఎకరాలు కేటాయించింది.

కంపెనీ అడిగిందే పది వేల ఎకరాలు అయితే... సర్కారు ఉదారంగా మరో 675 ఎకరాలు జత చేసి మరీ ఇచ్చింది. ఇదేమని అడిగిన వారికి వైఎస్ మరో షాక్ ఇచ్చారు. విమానాశ్రయం, ఏవియేషన్ అకాడమీల పేరు చెప్పి మరో 4000 ఎకరాలు అప్పగిస్తున్నాం, ఏం చేస్తారని సవాల్ చేశారు. ఇలా 'గాలి'కి సహకారం అందించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి భారీ మొత్తంలో 'వాటాలు' దక్కినట్లు కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.

అక్షర సత్యాలు

ఈ దోపిడీపై 'ఆంధ్రజ్యోతి' అప్పట్లో వరుస కథనాలు ప్రచురించింది. బ్రహ్మణి స్టీల్స్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో పోలుస్తూ... దానికి అంత భూమి ఇవ్వడం దారుణమని ఘోషించింది. ఈ స్టీల్ ప్లాంట్ భవితవ్యంపై పలు సందేహాలు వ్యక్తంచేసింది. ఆ కథనాలు నూటికి నూరుపాళ్లు నిజమని ఇప్పుడు రుజువైంది. బ్రహ్మణి పేరు చెప్పి దక్కించుకున్న ఇనుప ఖనిజం నిక్షేపాలను విదేశాలకు తరలించి వేల కోట్ల రూపాయలు దండుకున్న గాలి... స్టీల్ ప్లాంట్‌ను మాత్రం గాలికొదిలేశారు.

ఈ నిక్షేపాల అమ్మకం ద్వారా వచ్చిన 1500 కోట్ల రూపాయలను తాను స్టీల్ ప్లాంట్‌పై పెట్టుబడి పెట్టినట్లు గాలి ఘనంగా చెప్పుకొన్నారు. అంటే, గాలి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవటానికి పెట్టుబడి సర్కారు ఇచ్చిన గనులే. స్టీల్ ప్లాంట్‌పై పెట్టుబడికీ ఇదే ఆధారం. ఇప్పుడు గాలి బ్రహ్మణి ఉద్యోగుల్ని తొలగించారు. స్టీల్ ప్లాంట్‌ను ఏకంగా అమ్మకానికి పెట్టారు. అంటే సర్కారు ఇచ్చిన భూములు... ఇనుప ఖనిజం అమ్మగా వచ్చిన డబ్బుల్నే పెట్టుబడిగా పెట్టి ఆయన ఈ 'డీల్' ద్వారా మరోసారి భారీ ఎత్తున సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఓఎంసీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ తొలుత స్పందించనేలేదు. ఆ తర్వాత కర్ణాటకలో గాలిని, ఆంధ్రలో జగన్‌ను దెబ్బతీసే ఉద్దేశంతో పావులు కదిపాయి. ముందు నోరు మెదపని కాంగ్రెస్ నేతలూ ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించారు.

ఓఎంసీలో అక్రమాలు నిజమేనని సుప్రీంకోర్టు సాధికార కమిటీ నిగ్గుతేల్చడంతో ఆంధ్రజ్యోతి కథనం అక్షర సత్యమని రుజువైంది. అయితే బ్రహ్మణి ఎలా పుట్టింది? ఏ వనరులతో పుట్టింది? దానిని ఎలా అమ్మి సొమ్ము చేసుకుంటారు? పోయిన సొమ్మును ముక్కు పిండి వసూలు చేయడం ఎలా? అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దృష్టి సారించడం లేదు. ఆనాడే అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే వేల కోట్ల రూపాయల ఖనిజ సంపదను, ప్రభుత్వ భూమిని కాపాడుకునే అవకాశం ఉండేది.

బయ్యారం యవ్వారం

ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనుల వ్యవహారమూ ఇలాంటిదే. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు చెందినదిగా భావిస్తున్న రక్షణ స్టీల్స్ కంపెనీకి వేలాది కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని దోచిపెట్టేందుకు పథకం వేశారు. ఖమ్మం జిల్లాలో 1.41 లక్షల ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి రిజర్వు చేయడం, దానికిముందే ఆ సంస్థ రక్షణ స్టీల్స్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవడం... అన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోయాయి.

'అల్లుడి గిల్లుడు' పేరుతో ఈ వ్యవహారం గుట్టును ఆంధ్రజ్యోతి రట్టు చేసింది. అయితే దీనిపై కూడా అధికార పార్టీగానీ, యంత్రాంగంగానీ సకాలంలో స్పందించలేదు. వైఎస్ మరణానంతరం, రాజకీయ పరిస్థితులు మారిన తర్వాతే రక్షణ స్టీల్స్ దోపిడీకి అడ్డుకట్ట పడింది. జగన్‌ను కట్టడి చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్సయింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏపీఎండీసీకీ రిజర్వ్ చేసిన 1.41 లక్షల ఎకరాల ప్రాంతాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాగే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న లక్షల కోట్ల విలువైన బాక్సైట్ నిక్షేపాలను అస్మదీయ కంపెనీలకే కట్టబెట్టారు. దీనికి కూడా ఏపీఎండీసీని పావుగా వాడుకున్నారు. ఈ బాక్సైట్ నిక్షేపాలు అంతిమంగా చేరేది కూడా 'అన్‌రాక్' పేరుతో అస్మదీయులు నెలకొలుతున్న అల్యూమినియం ప్లాంట్‌కు, మరో సంస్థ జిందాల్‌కూ కావటం విశేషం.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాయకులు తరచు చెబుతుంటారు. అయితే గనుల్లో జరిగిన అక్రమాలు, వాటిపై చట్టం స్పందనను చూస్తే చట్టం తన పని కాకుండా, వేరెవరి పనో చేసుకుపోతోందనే అభిప్రాయం కలుగుతుంది. అధికారంలో ఉన్నంతకాలం అన్నీ సక్రమం... ఆ అధికారం పోయాకే అక్రమం అనే విచిత్రమైన చట్టం ఇక్కడ నడుస్తోంది.

ఓ ప్రభుత్వ హయాంలో ఎవరికైనా అన్యాయం జరిగితే... ఆ ప్రభుత్వం మారి మన ప్రభుత్వం రావాలని దేవుణ్ని ప్రార్థించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీతోనూ సంబంధం లేని వారికైతే ఎప్పటికీ న్యాయం జరగని దుస్థితి దాపురిస్తోంది. నిజానికి... ఓబుళాపురం, బ్రహ్మణి, బయ్యారం... ఇలా ప్రతి కుంభకోణాన్ని 'ఆంధ్రజ్యోతి' అప్పుడే వెలుగులోకి తెచ్చింది.

గనుల మాటున జరిగిన దారుణాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. కానీ... అప్పుడు కాంగ్రెస్ నేతలెవరూ నోరు మెదపలేదు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇంత నోరేసుకుని మాట్లాడుతున్నారు. ఈ నేతలు అప్పుడే ప్రశ్నించి ఉంటే మన రాష్ట్రానికి, వారి సొంత పార్టీకి ఈ దుస్థితి తలెత్తేదే కాదు! నేటి పరిస్థితికి కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలి. వారే... ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.
click here 

ఒక రాజు.. ఒక మంత్రి
అధికారపు మేడలో అవినీతి జాడలు

ఆలోచన వైఎస్‌ది.. ఆచరణ కేవీపీది
మిత్రులుగా విడదీుయరాని బంధం
అక్రమాల్లోనూ అదే స్థాయి సంబంధం
'సుప్రభాత దర్శనం'లో కీలక నిర్ణయాలు
పై స్థాయిలో అంతా అస్మదీయ అధికారులే
ఎంత అవినీతికి పాల్పడినా చర్యలు నిల్
ఇదిఒక్కరికి మాత్రమే అంటిన మకిలి కాదు!
ఆత్మ
* కేవీపీ నా అంతరాత్మ. ఆయన దగ్గర దాచేదేమీ లేదు.
* ముందు నేను కనపడతాను! కానీ, వెనుకుండి చాలా వరకు చూసుకునేది కేవీపీనే. మొదటి నుంచీ అంతే.
* కేవీపీ నాలో నిత్యం కాన్ఫిడెన్స్ నింపే వారు. అందుకే.. ఇవాళ ఇలా ఉన్నాను.
* కేవీపీ ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
- వైఎస్

అంతరాత్మ

* వైఎస్ అపాత్ర దానం చేస్తారు. ఇది తగదని చెబుతుంటాను.
* వైఎస్ ఈజ్ ఎ బార్న్‌డ్ లీడర్. ఆయన సూర్యుడు. ఆయన వెలుగులోనే నేను ప్రకాశిస్తాను. నాకై నేను వెలుగివ్వలేను.
* మా పిల్లలు రాజకీయాల్లోకి రావడం నాకిష్టంలేదు. రాజకీయాల్లోకి వస్తే టైము, ప్రైవసీ ఉండవు. జగన్ రాజకీయాల్లోకి రావడమూ నాకిష్టం లేదు.
- కేవీపీ

తిరుమలకు వెళితే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. తర్వాతే వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్లాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడా సేమ్ టు సేమ్! వైఎస్ 'దర్శనానికి' వెళ్లే వారెవరైనా ముందు ఆయన 'అంతరాత్మ' కేవీపీ రామచంద్రరావును కలవాలి. ఆయనను కలిసి మాట్లాడాకే, వైఎస్ వద్దకు వెళ్లాలి. తిరుమలలో నేరుగా వెంకన్న వద్దకు వెళ్లినా... 'వరాహ స్వామిని దర్శించుకున్నావా?' అని ఆ దేవుడు అడగడు.

కానీ... ఈ 'దేవుడు' మాత్రం 'కేవీపీని కలిశారా?' అని తప్పకుండా అడిగేవారట! 'లేదు' అనే సమాధానం వస్తే... 'తర్వాత కలవండి' అని స్పష్టం చేసే వారని చెబుతారు. మొత్తానికి ఒక్కటి మాత్రం నిజం! వైఎ స్‌ను కలవడానికి ముందుగాని, ఆ తర్వాతకానీ.. కేవీపీని కలవడం తప్పనిసరి. వ్యవహారాలు నడపడంలో వారిద్దరి మధ్య ఆ స్థాయిలో 'అవగాహన' ఉండేదని చెబుతారు.

"కేవీపీ పనికి రాని వాడు. మెడిసిన్ చదువుకున్నా డాక్టర్ వృత్తి కూడా చేయలేడు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. అలాంటి వ్యక్తికి క్యాబినెట్ హోదా కట్ట బెట్టడం వైఎస్ చేసిన పొరపాటు''... అని కొండా సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. కొండా సురేఖ వంటి సాధారణ నేతలు సైతం గుర్తించగలిగేంత పొరపాట్లు వైఎస్ చేశారనుకుంటే, అదికూడా కేవీపీ విషయంలో చేశారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

'కేవీపీ నా అంతరాత్మ' అని వైఎస్ స్వయంగా చెప్పుకొనేవారు. అంతేకాదు... 'తెర ముందు మాత్రమే నేను కనిపిస్తా. తెర వెనుక ఉండి నడిపించేది కేవీపీయే' అని కూడా ఓ సందర్భంలో తేల్చి చెప్పారు. దీని అంతరార్థం ఒక్కటే! వైఎస్ తన అంతరాత్మలో ఒకటి ఆలోచించే వారు. దానిని కేవీపీతో పంచుకునేవారు. కేవీపీ ఆ ఆలోచనను యథాతథంగా కార్యరూపంలోకి తెస్తారు. మరి... కొండా సురేఖ చెప్పినట్లుగా కేవీపీ ఒక్కరే కోట్లు దోచుకోవడం ఎలా సాధ్యం?

నమ్మితే చాలు....

'నమ్మిన వాడు ఎంత తప్పు చేసినా కాపాడటం... గిట్టని వాడు చిన్న పొరపాటు చేసినా సహించలేకపోవడం!' ఇదోరకం ఫ్యూడలిస్టు మనస్తత్వం. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి తన పరిపాలనలో ఇదే ఫార్ములాను అనుసరించారు. 'నమ్మిన వాళ్లకు' ఏమైనా చేసేవారు. ఇందుకు ఉదాహరణ సూరీడు. ఓ రేషన్ షాప్ డీలర్ అయిన సూరీడిని, తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు.

నిబంధనలు అంగీకరించకున్నా 'అడిషనల్ పర్సనల్ సెక్రటరీ' అనే హోదా కట్టబెట్టారు. సూరీడికే ఇంత చేసిన వైఎస్... తన ఆత్మబంధువు కేవీపీ కోసం ఎంత చేసి ఉంటారు? ఒకరిపై ఒకరికి తిరుగులేని నమ్మకం ఉన్నందునే... కేవీపీని వైఎస్ అందలమెక్కించారు. తొలుత ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత ప్రజా భద్రతా కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్ ప్రమేయం లేకుండా కేవీపీ ఒక్కరే అవినీతికి పాల్పడ్డారన్న కొండా సురేఖ మాటే నిజమైతే... 'అద్దం పచ్చి అబద్ధాలు చెబుతుంది' అనడం కూడా నిజమవుతుంది.

ఆలోచన వైఎస్.. ఆచరణ కేవీపీ

ఆలయాల్లో సుప్రభాత దర్శనం అని ఒకటుంటుంది! ప్రశాంత వాతావరణంలో... మనసులోని కోరికలు దేవుడికి మనసారా విన్నవించుకునే అవకాశం! వైఎస్ హయాంలోనూ 'సుప్రభాత' దర్శనం నడిచింది. అత్యంత కీలకమైన, ముఖ్యమైన, పెద్ద పెద్ద 'విషయాలతో' ముడిపడిన విషయాలు మాట్లాడుకునేందుకు వైఎస్ ఇచ్చే సమయం... తెల్లవారుజామున 5 గంటలకు! 'సుప్రభాతం' అప్పాయింట్‌మెంట్ ఫిక్స్ అయ్యిందంటే... 90 శాతం పని ముగిసినట్లే అని అప్పట్లో చెప్పుకొనేవారు.

ఇక... తెల్లవారుజామున వైఎస్ మాట్లాడుకున్న మ్యాటరును అమలులోకి తెచ్చే బాధ్యతను కేవీపీ చేపట్టేవాడని చెబుతారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో... ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు 'డి' బ్లాక్ నుంచి 'సి' బ్లాక్‌కు వెళ్లేవారు. ఒక్క నిమిషం అటూ ఇటూ కాదు! టైమ్ అంటే టైమే! ఆ టైమ్‌లో... ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. అదే సమయంలో... తెల్లవారుజామున జరిగిన చర్చలు, వాటి అమలుపై చర్చించుకునే వారు. ఆ తర్వాత... అంతా కేవీపీ చూసుకుంటారు! ...ఇది సచివాలయంలో ఉన్నతస్థాయి అధికార వర్గాలే చెప్పుకొనే విషయం.

కేవీపీ ఇంట్లో ఉన్నారంటే... ఆ వీధిలో దాదాపుగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. నేతలు, అధికారులు 'వివిధ రకాల పనుల' కోసం కేవీపీని దర్శించుకునే వారు. ఈ పనులన్నీ ప్రభుత్వ స్థాయిలో జరిగేవే. వైఎస్‌కు తెలియకుండానే కేవీపీ ఈ పనులను చక్కబెట్టేవారంటే అమాయకత్వమే అవుతుంది.

పాలూ నీళ్లను వేరు చేయడం ఎంత అసాధ్యమో... ఇప్పటిదాకా జరిగిన, జరిగిందని చెబుతున్న అవినీతిలో కేవీపీ, వైఎస్‌లను వేరు చేసి చూడటం కూడా అసాధ్యం! పాలూ నీళ్లను హంస వేరు చేయగలదన్నది అవాస్తవమైన భావన! ఆ లెక్కన... అవినీతి విషయంలో కేవీపీ, వైఎస్‌లను కొండా సురేఖ వేరు చేసి చూపడం ఒక వాస్తవమైన కల్పన!

సీఎం - సూపర్ సీఎం

కొన్ని రోజులు అటూ ఇటుగా... ఐదు సంవత్సరాలా నాలుగు నెలలపాటు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకదశలో వైఎస్ సీఎం అయితే... కేవీపీ సూపర్ సీఎంలాగా మారారు. ఇంకా చెప్పాలంటే... వైఎస్సే తన ఆత్మబంధువును ఆ స్థాయికి తీసుకొచ్చారు. వైఎస్ ఆలోచనలకు అనుగుణంగానే కేవీపీ నడుచుకున్నారు. వైఎస్ హయాంలో అధికార యంత్రాంగం కోరలు పీకేశారు.

ఇంకా చెప్పాలంటే... వాళ్ల మెదళ్లకు సెలవు ఇచ్చారు. తమ ఆలోచనల ప్రకారం పనులు చేసే అధికారులనే దగ్గరికి తీశారు. ఈ నియామకాల్లో కేవీపీ పాత్ర చాలా కీలకం. తాము చెప్పింది చెప్పినట్లుగా వింటారనే ఉద్దేశంతోనే... నిబంధనలు అనుమతించకున్నా సీఎం పేషీలో భాను అనే అధికారిని తెచ్చి పెట్టుకున్నారు. మిగిలిన అన్ని కీలక విభాగాల్లోనూ తమ మాట వినే అధికారులనే నియమించారు.

ఎమ్మార్, రహేజా వంటి కుంభకోణాలకు అధికారులే సహకరించినట్లు స్పష్టం కావడం ఇక్కడ గమనార్హం. ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అగ్రిమెంట్‌లో నిబంధనలను పకడ్బందీగా రూపొందించడం సహజం. కానీ... 'సొంత' మెదళ్లతో ఆలోచించడం మానేసిన కొందరు అధికారులు ఎమ్మార్, రహేజాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని క్లాజులను వాటికి అనుకూలంగా రూపొందించారు. వెనక్కి తీసుకోలేనంత స్థాయిలో సాగిలబడ్డారు. దీంతో ఏపీఐఐసీ నిండా మునిగిపోయింది.

అవినీతికి ఆసరా ఎవరు?...

'కేవీపీ బ్రోకర్. ఆయన జలయజ్ఞంలో కోట్లు దోచుకున్నారు' అని కొండా సురేఖ తన లేఖలో మండిపడ్డారు. ఆమె చెప్పినట్లుగా కేవీపీ అవినీతికి పాల్పడటం ఎంత నిజమో... తన హయాంలో అవినీతిని తేలిగ్గా తీసుకుని, అవినీతిపరులను వైఎస్ నిర్భయంగా ప్రోత్సహించారన్నదీ అంతే నిజం! ఏ స్థాయిలో అవినీతి ఆరోపణలు వెలువడినా వైఎస్ 'లైట్'గా తీసుకున్నారు.

'నా వాడైతే చాలు, ఏమైనా చేయొచ్చు' అనే సంకేతాలను సూటిగా పంపారు. దీనికి కూడా వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడి ఉదంతమే ఒక స్పష్టమైన ఉదాహరణ. డిపెప్ కుంభకోణంలో సూరీడి ప్రమేయంపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా... వైఎస్ ఆయనపై ఈగ వాలనీయలేదు. విమర్శలు ఎన్ని వచ్చినా... విచారణకు అంగీకరించలేదు.

ఓరోజు ఉదయాన్నే సూరీడు 'సార్! నావల్ల మీకు చెడ్డ పేరు వస్తోంది' అంటూ బాధగా మొఖం పెట్టారట! దీనిపై వైఎస్ స్పందిస్తూ... 'సరే లేవయ్యా! ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా చేసుకో!' అని ధైర్యం చెప్పారట! 'చేసింది చాలు ఇంకా ఆపేయ్' అనాల్సిన సీఎం 'జాగ్రత్తగా చేసుకో' అనడంపై ఆ పక్కనే ఉన్న ఇతర ఉద్యోగులు అవ్వాక్కయారట! వోక్స్ వ్యాగన్ కుంభకోణంపైనా వైఎస్ ఇలాగే స్పందించారు.

ఒక ఉత్తుత్తి కంపెనీకి డబ్బులు చెల్లించి, రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో పోయినా... బొత్స సత్యనారాయణను వెనకేసుకొచ్చారు. భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లపై చర్యలకు అంగీకరించలేదు. 'వీరిపై చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది' అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు సూచించినా... ఒక అధికారిణి తాము చెప్పినట్లు వింటుందని, ఇంకొక అధికారిణి భర్త జర్నలిస్టుగా తమకు పనికొస్తాడని అంటూ చర్యలకు వైఎస్ ససేమిరా అన్నట్లు చెబుతారు.

ఇంకో అధికారిపై చర్యల గురించి ప్రస్తావిస్తే...'కేవీపీతో మాట్లాడండి' అని సూచించినట్లు సమాచారం. అవినీతి విషయంలో కింది నుంచి పై దాకా వైఎస్‌ది ఒకే స్టైల్! 'నా వాడైతే చాలు! వదిలేద్దాం' అనేదే ఆయన వైఖరి. మరి...సురేఖ వాపోతున్నట్లుగా... 'అవినీతికి పాల్పడిన' కేవీపీది తప్పా! అవినీతిని గుండుగుత్తగా ప్రోత్సహించిన వైఎస్‌ది తప్పా! ఏది ఏమైనా అవినీతి జరిగిందనేది నిజం! ఎవరి వాటా ఎంత అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. 

click here

Friday, November 19, 2010

Sunday, October 3, 2010

అలహాబాద్ పంచాయతీ ... అందరికీ న్యాయం

‘ఆలస్యం అమృతం విషం’ అన్న వాడెవడోగాని తన అభిప్రాయాన్ని అర్జంటుగా మార్చుకోవాలి. కనీసం కొన్ని వ్యవహారాల్లో ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని అలహాబాదు హైకోర్టు వారి అయోధ్య తీర్పు చూశాక చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఈ తీర్పే కనుక పదేళ్ల కిందట వచ్చి ఉంటే దేశమంతా అల్లకల్లోలమయ్యేది. అది రామజన్మ భూమేనని తేల్చాక ఆ భూమిలో ముస్లింలకు ఎందుకు వాటా ఇవ్వాలని సాధుసంతులూ, సింగాల్లూ... మా మసీదును కుప్పకూల్చిన వాళ్లకు అదే స్థలం మీద హక్కునివ్వటమేమిటని ఇమాంలూ, షాబుద్దీన్లూ గావుకేకలు పెడుతూ మిన్నూమన్నూ ఏకంచేస్తూండేవాళ్లు. ‘బందు’లూ, డైరక్టు యాక్షన్లూ, పనిలో పనిగా మతకలహాలూ, వాటిని అణచేందుకు కర్ఫ్యూలూ, కాల్పులతో యావద్భారతం అట్టుడికిపోయేది.
ఇప్పుడూ అలా అవుతుందని పాపం మన పోలీసులు ఎంత హడలిపోయారు! లక్నో బెంచి నుంచి ఇలా తీర్పు రాగానే అలా దేశమంతటా మంటలంటుకుంటాయని ముందే ఊహించి, తీర్పు ముహూర్తానికి కొన్ని గంటల ముందునుంచే దుకాణాలను, దివాణాలను దగ్గరుండి బంద్ చేయించి, చెప్పకుండానే కర్ఫ్యూ వాతావరణం తెచ్చేసి ఎంత హైరాణ పడ్డారు!? అదంతా అకారణ భయమని పోలీసుల పగవాళ్లు కూడా అనలేరు. షాబుద్దీన్‌లూ, తొగాడియాలూ లేటెస్టుగా బుద్ధిమాన్ బాలక్‌లు ఏమీ కాలేదు. రంకెలు వేసి దుంపలు తెంచడానికి వాళ్లూ వీళ్లూ ఎవర్‌రెడీనే. ఎటొచ్చీ వాళ్లను పట్టించుకొనే తీరికే, కోరికే ఇవాళ్టి భారతదేశానికి లేదు. రామజన్మభూమి - బాబరీ మసీదు గొడవనేది ఈ కాలపు వాళ్ల దృష్టిలో చచ్చిన సమస్య. అందుకే ఇరుపక్షాల్లో మత పెద్దలు తాజా తీర్పుపై ఎంత అసంతృప్తి వెలిబుచ్చినా ఏ మతవర్గంలోనూ అలజడి లేవలేదు. దేశం మొత్తంలో ఆకయినా కదలలేదు. కాబట్టి అరవై ఏళ్లకిందటి వ్యాజ్యంలో ఇప్పుడా తీర్పు అని ఆక్షేపించాల్సిన పనిలేదు. నత్తలకు ముత్తాత అయిన భారత న్యాయవ్యవస్థలో జడ్జిమెంట్లు జీవితకాలం లేటు అవటమూ ఇలాంటప్పుడు మేలే కాబోలు!
* * *
సాధారణంగా ఏ వ్యాజ్యంలోనైనా తీర్పరి చెప్పేదాన్ని కొందరు మెచ్చుకుంటారు. కొందరు నొచ్చుకుంటారు. కేసు గెలిచినవాడు ఎగిరి గంతేస్తాడు. ఓడినవాడు పై కోర్టుకు పోతాడు. అయోధ్య కేసు చిత్రం! దానిలో కక్షిదారులు ముగ్గురు. తీర్పును చూశాక ముగ్గురూ పై కోర్టుకు అపీలుకు పోవాలనే అనుకుంటున్నారు! గెలిచానన్న సంతోషం ఏ ఒక్క కక్షిదారుడికీ కలిగించనిది ఇదేమి తీర్పు అని వాళ్లు, మిగతావాళ్లు తీర్పరులను తప్పుబడుతున్నారా అంటే అదీ లేదు. లోన ఎంత గొణిగినా, పైకి ఎంత సణిగినా తీర్పు మీద బాహాటంగా ధ్వజమెత్తి, బజార్నపడే దమ్ములు ఎవరికీ లేవు. మామూలుగా... ముస్లింలు, హిందువులు తగవుపడ్డ పెనువివాదంలో తీర్పును ‘సెక్యులర్’ వామాచారులు పొగిడితే ‘కాషాయం’ కాంపువాళ్లు తెగడుతారు. వారు తెగడితే వీరు పొగుడుతారు. అయోధ్య తీర్పుకు మాత్రం వారూ వీరూ జాయింటుగా జేజేలు పలకటం విశేషం!
ముగ్గురు తగవుపడ్డ భూమిని ముగ్గురికీ సమానంగా పంచి అన్ని పక్షాలకూ, ఉభయమతాలకూ సమాన న్యాయంచేసిన అలహాబాదు న్యాయాన్ని కొనియాడని మీడియా లేదు. మత కల్లోలాలకు తావులేకుండా మంచిపని చేశారని తల ఊచని రాజకీయ జీవీ లేడు. మేధావీ లేడు. ఈ మెచ్చుకోళ్లు, వీరతాళ్లు చాలా బోలెడు సమంజసమే. ఎటొచ్చీ... సూడో సెక్యులర్ శషభిషలతో పనిలేని సగటు మానవుడికి వచ్చే డౌటల్లా ఒక్కటే.
న్యాయస్థానమనేది పంచాయతీ రచ్చబండ కాదుకదా? తన ముందుకు వచ్చిన వ్యాజ్యంలో ఏ కక్షిదారు కోరేది సబబో, ఎవరి వాదం ఎంతవరకు చట్టబద్ధమో నిర్ధారించి... ఎవరి ప్రార్థనను మన్నించాలన్నదే కదా కోర్టు చేయాల్సిన పని? మరి - ఊళ్లో వాళ్లు తగవు పడితే ఊరి పెద్దలు కలగజేసుకుని, వారివారి వాదాలతో నిమిత్తం లేకుండా, తమకు తోచిన విధంగా పంచాయతీ పరిష్కారం చేసినట్టు... ఎవరూ కోరని దానిని తనకు తాను నిర్ణయించి, అందరి మీదా రుద్దే అధికారం ఎంత ఉన్నత న్యాయస్థానానికైనా ఉన్నదా?
అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది వివాదాస్పద స్థలం ఎవరిదన్న యాజమాన్య సమస్య. అది మాదంటే మాదని వాదులాడిన వారిలో ఎవరిది న్యాయమన్నదే న్యాయపీఠం ప్రధానంగా తేల్చాలి. హక్కు ఎవరిదని తేలితే వారికే ఆస్తి దక్కాలి. వివాదాస్పద స్థలం ఎవరిదో తేల్చమని కక్షిదారులు కోరారే తప్ప... ఆ స్థలాన్ని మాలో మేము ఎలా పంచుకోవాలని అడగలేదు. తాను పరిశీలించాల్సింది హక్కుల వ్యాజ్యమే తప్ప పంపకాల దావా కానప్పుడు ముగ్గురూ సమానంగా పంచుకోవాలని లక్నో బెంచి పంచాయతీ పరిష్కారం ఎలా చేసింది?
ధర్మాసనం మీద న్యాయమూర్తులు ముగ్గురు. ఒకే వ్యాజ్యంలో ముగ్గురూ మూడు రకాల తీర్పులు ఇచ్చారు. మిగతా విషయాల్లో ఎవరు ఎలా విభేదించినా... అరవై ఏళ్ల కింద రామ్‌లాలా విగ్రహాలు ప్రతిష్ఠించి, హిందువులు పూజిస్తున్న స్థలం రామజన్మభూమే; దాని మీద హక్కు హిందూ పక్షానికే చెందాలి- అన్న విషయంలో ముగ్గురూ ఏకీభవించారు. గుడిని కూల్చి బాబరీ మసీదును కట్టలేదని; కూలిన గుడి శిథిలాల మీద మసీదును కట్టారని కనుగొన్న న్యాయమూర్తి కూడా సరిగ్గా ఆ మసీదు కింది పూజాస్థలంపై హిందువులదే హక్కని తేటతెల్లంచేశారు. అసలు గొడవంతా అది రాముడి జన్మస్థానమా, బాబరు మసీదా అన్న విషయం మీదే అయినప్పుడు... ఆది నుంచీ ఉన్న గుడి స్థానంలో మసీదు కట్టారన్న వాదాన్ని ముగ్గురు తీర్పరులూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నప్పుడు వివాదాస్పద స్థలం మొత్తాన్ని జస్టిస్ శర్మ చెప్పినట్టు హిందూ కక్షిదారుకే కదా దఖలు పరచాలి? మరి- లోపల హక్కయితే వీరిది; వెలుపల ఇతర మతస్థులు కూడా ఎప్పటినుంచో ప్రార్థనలు చేస్తున్నట్టు తేలింది కనుక వారికీ జాయింటు హక్కు ఉంది; కాబట్టి కక్షిదారులు ఆస్తిని ఇదిగో ఈ విధంగా పంచుకోవాలి- అంటూ న్యాయస్థానం వాటాలు వేయటం చట్టరీత్యా చెల్లుతుందా? అందరికీ న్యాయం చేయబోయన అలహాబాదు ఉద్దేశం, మంచిదే అయనా న్యాయం సుప్రీంకోర్టు పరీక్షలో నిలబడుతుందా?
-సాక్షి